ప్రస్తుతం తమిళ సినిమా ఇండస్ట్రీకి( Tamil Movie Industry ) ఏదైనా లోటు ఉంది అంటే అది ఖచ్చితంగా పాన్ ఇండియా( Pan India ) వ్యాప్తంగా ఒక మంచి చిత్రం లేకపోవడమే.అయితే కొన్నేళ్ళకి వెనక్కి వెళితే సౌత్ ఇండియాలో తమిళ సినిమాలదే హవా.
మన తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా చెన్నైలోనే ఉండేది.ఎలాగోలా మనవాళ్లు హైదరాబాద్ కి తెచ్చేసుకున్నారు.
సరే అదంత గతం మాత్రమే.అంత బాగా హవా చూపించిన సౌత్ ఇండియాలో ప్రస్తుతము ఆ పరిస్థితులు లేవు.
పైగా మన టాలీవుడ్ చిత్ర పరిశ్రమ( Tollywood ) పాన్ ఇండియా సినిమా విషయం వచ్చేసరికి ఇండియాలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంది.మన సినిమా తర్వాతే మిగతా భాషలన్నీ కూడా క్యూ కడుతున్నాయి.

మొదట తెలుగు సినిమా పరిశ్రమ ఉంటే రెండవ స్థానం బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు దక్కింది.ఇక మూడవ ప్లేస్ లో కన్నడ చిత్ర పరిశ్రమ ఉంటే నాలుగవ ప్లేస్ లో తమిళ చిత్ర పరిశ్రమ ఉంటుంది.మరి ఇంత వెనుక పడటానికి కారణాలు అనేకం ఉండొచ్చు.ఏది ఏమైనా తమిళ సినిమాలు( Tamil Movies ) ఫ్యాన్ ఇండియా సినిమా తీయాలని కలలు అయితే కంటున్నాయి కానీ అవి నెరవేరడం లేదు.
నిన్న మొన్నటి వరకు పోన్నీయన్ సెల్వన్,( Ponniyin Selvan ) లియో,( Leo ) జైలర్, విక్రమ్ వంటి సినిమాలు వచ్చి పాన్ ఇండియా వ్యాప్తంగా పేరైతే సంపాదించుకున్నాయి.అలాగే వందల కోట్ల వసూలు కూడా దక్కించుకున్న ప్రాపర్ పాన్ ఇండియా చిత్రంగా మాత్రం పేరు దక్కించుకోలేకపోయారు.

ఇవన్నీ కూడా తమిళ సినిమా పరిశ్రమలో బాగా వసూళ్లు సాధించాయి.అయితే ఆ లోటు తీర్చడానికి సూర్య( Surya ) నేనున్నాను అంటూ ముందుకొస్తున్నాడు.ఈ మధ్య విడుదలైన కంగువా( Kanguva ) టీజర్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు ఇది నేషనల్ స్థాయి సినిమా అంటూ పొగుడుతున్నారు.పైగా ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న శివ కంగువ చిత్రాన్ని 38 భాషల్లో డబ్బింగ్ చేయబోతున్నారట పైగా సూర్య నటన కూడా అద్భుతంగా ఉంటుందని అందరూ అంటున్నారు.
మరి సినిమా విడుదలయితే గాని దాని పరిస్థితి ఏంటో తెలియదు గాని ఫ్యాన్ ఇండియా అనే ఒక దాహంతో ఉన్న తమిళ సినిమా ఇండస్ట్రీకి ప్రస్తుతం ఏకైక దిక్కుగా సూర్య కనిపిస్తున్నాడు.