తప్పనిసరి పరిస్థితిలోనే ఓటీటీకి వెళ్తున్న అంటున్న సూర్య

తమిళ స్టార్ హీరో సూర్య నిర్మాతగా తన భార్య జ్యోతిక ప్రధాన పాత్రలో తెరకెక్కించిన సినిమా త్వరలో అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కాబోతుంది.ఈ సినిమా కారణంగా థియేటర్ యాజమాన్యాలకి, సూర్యకి మధ్య గొడవ నడుస్తుంది.

 Surya Gives Clarity On Ott Release, Tollywood, Kollywood, South Cinema, Amazon P-TeluguStop.com

థియేటర్ లో సినిమాని రిలీజ్ చేయకుండా ఓటీటీలో రిలీజ్ చేస్తే సూర్య తన ప్రొడక్షన్ లో నిర్మించే ఏ సినిమాని థియేటర్ లో రిలీజ్ చేయబోమని డిస్ట్రిబ్యూటర్స్ తీర్మానించారు.అయినా కాని వారిని లెక్క చేయకుండా సూర్య జ్యోతిక సినిమాని అమెజాన్ లో రిలీజ్ చేయడానికి రెడీ అయిపోయాడు.

ఇక రిలీజ్ డేట్ కూడా ప్రకటించేశాడు.ఈ నెల 29న అమెజాన్ లో పొన్ మగల్ వంధాల్ చిత్రం స్ట్రీమింగ్ కాబోతుంది.

ఇక ఈ సినిమా విషయంలో సూర్య కొంత స్పష్టత ఇచ్చినట్లు టాక్ వినిపిస్తుంది.నా సినిమా నా ఇష్టం అంటున్నాడు.నేను థియేటర్లో రిలీజ్ చేయాలనే సినిమా తీశాను.కానీ పరిస్థితులు అనుకూలించలేదు.

ఇక ప్రొడక్షన్ హౌస్ కారణంగా చాలా అప్పు చేశాను.దానిని తీర్చాలంటే నాకు మరో అవకాశం కనిపించలేదు.

ఒక వేళ సినిమాలు ఫ్లాప్ అయితే రిలీజ్ కి అభ్యంతరం వ్యక్తం చేస్తున్న థియేటర్ యాజమాన్యాలు వచ్చి ఆదుకోవడం లేదు కదా.అలాగే నా సినిమాని నాకు నచ్చిన చోట రిలీజ్ చేసుకుంటా.నా బిజినెస్ నా ఇష్టం అని అంటున్నట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube