సూర్య తమిళంలోనే కాదు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉన్న హీరో.అంతకుమించి మంచి యాక్టర్ కూడా.
ఇక యాక్షన్ సన్నివేశాలలో అయితే సూర్య నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అయితే గత కొంత కాలం నుంచి సూర్య తనకు తిరుగు లేదు అన్నట్లుగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.
హిట్టూ ఫ్లాపులతో సంబంధం లేకుండా ఎన్నో సినిమాల్లో నటిస్తున్నాడు.అయితే ఇక ఏదైనా సినిమాకి కాస్త గ్యాప్ వచ్చినా తన సొంత నిర్మాణ సంస్థలో ఓ సినిమాను తెరమీదికి తెచ్చి ప్రేక్షకులను అలరిస్తున్నారు.
కేవలం కమర్షియల్ ఎలిమెంట్స్ మీద దృష్టి పెట్టకుండా వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తూ ఉన్నాడు.ఇప్పటికే 24 , సెవెంత్ సెన్స్ లాంటి సినిమాలతో తన వైవిధ్యమైన ఆలోచనలను అభిమానులందరికీ తెలియజేశాడు.
ఇక ఇటీవలే ఆకాశమే నీ హద్దురా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ సినిమా ముందుగా అనుకున్నట్టుగా థియేటర్లో విడుదల కాలేదు.ఓటిటీలో రిలీజ్ అయింది ఓటిటి లో రిలీజ్ అయితే పెద్దగా రెస్పాన్స్ ఏం వస్తుందిలే అని అందరూ అనుకున్నారు.కానీ ఊహించని రీతిలో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది ఈ సినిమా.
ఇక ఆ తర్వాత లాయర్ చందు కెరియర్లో ఒక కీలకమైన కేస్ ఆధారంగా జై భీమ్ అనే సినిమాను తెరకెక్కించాడు.ఎంతో మంది గిరిజనులు ఎదుర్కొంటున్న వివక్షను కళ్లకు కట్టినట్లు చూపుతూ అందరి మనసును కదిలించింది జై భీమ్ సినిమా.
విమర్శకుల ప్రశంసలు అందుకుంది.ఈ సినిమా జాతీయ అవార్డులకు ఎంపిక కావడం గమనార్హం.
ఇలా ఇటీవలి కాలంలో హీరో సూర్య కు కూడా టైమ్ బాగా కలిసొస్తుంది.చేసిన ప్రతి సినిమా సూపర్ హిట్ అవుతుంది.
దీంతో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు సూర్య.
ఈ క్రమంలోనే ‘ఇతరుక్కుమ్ తునినందనం‘.అనే యాక్షన్ థ్రిల్లర్ సినిమా తో వచ్చే నెల 4వ తేదిన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు సూర్య.ఈ సినిమా పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కింది.
ఇక ఆ తర్వాత వాడి వాసల్ అనే ప్రాజెక్టును పట్టా లెక్కించేందుకు సిద్ధమయ్యాడు.దీనికి సంబంధించి షూటింగ్ మరికొద్దిరోజుల్లో ప్రారంభం కాబోతుంది.
ఆకాశమే నీ హద్దురా దర్శకురాలు సుధ కొంగర, మరో దర్శకుడు శివకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట సూర్య.సొంత బ్యానర్ లో కూడా 4 సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాడు సూర్య.
ఇలా టైం కలిసి వచ్చినప్పుడే వరుస సినిమాలతో దూసుకుపోవాలని అనుకుంటున్నాడట.