అత్యాచార బాధిత మహిళ కోసం ఉద్యమిస్తున్న సూర్య

సూర్య హీరోగా రీసెంట్ గా సుధా కొంగర దర్శకత్వంలో సూరరైపొట్రు మూవీ తెరకెక్కి ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.నిజ జీవిత కథని స్ఫూర్తిగా తీసుకొని ఈ మూవీని దర్శకురాలు సుధా కొంగర తెరపై ఆవిష్కరించారు.

 Surya Fight Justice For Rape Victim In Pandiraj Film, Tollywood, Sudha Kongara,-TeluguStop.com

ఈ సినిమా ఎంతో మందికి స్పూర్తిని ఇచ్చే విధంగా ఉంది.ఈ నేపధ్యంలో ఆస్కార్ పోటీకి ఈ మూవీ వెళ్ళడం విశేషం.

అలాగే అంతర్జాతీయ అవార్డులని సొంతం చేసుకోవడంతో పాటు అరుదైన రికార్డులని సూరరై పొట్రు సొంతం చేసుకుంది.ఇదిలా ఉంటే ప్రస్తుతం సూర్య పాండిరాజ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

దీని తర్వాత హరి దర్శకత్వంలో సింగం సిరీస్ లో ఒక మూవీ చేయనున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమాకి సంబందించిన అప్డేట్ ని ఆ దర్శకుడు తాజాగా మీడియాతో పంచుకున్నారు.

ఈ సినిమాని నిజజీవిత సంఘటనల స్ఫూర్తితో సిద్ధం చేసుకున్నదని చెప్పారు.గతంలో పొలాచ్చి ప్రాంతంలో మహిళలపై జరిగిన అత్యాచారాల నేపధ్యంలో కథనం ఉంటుందని తెలిపారు.అత్యాచార బాధితురాలి తరుపున న్యాయం కోసం పోరాడుతూ న్యాయం కోసం రాజకీయ నాయకులకి ఎదురుతిరిగే వ్యక్తిగా సూర్య ఈ సినిమాలో కనిపిస్తాడని చెప్పారు.అలాగే మూవీ 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందని తెలిపారు.

జులై మొదటి వారం నుంచి తిరిగి కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేస్తామని స్పష్టం చేశారు.ఇదిలా ఉంటే ఈ మూవీని వీలైనంత వేగంగా కంప్లీట్ చేసి హరి దర్శకత్వంలో సింగం సిరీస్ మూవీని స్టార్ట్ చేయడానికి సూర్య ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube