చక్కటి ఫ్యామిలీ ప్లానింగ్.. వరస సినిమాలతో కుటుంబానికి అండగా సూర్య

తమిళ్ తో పాటు సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి స్టైలిష్ హీరో సూర్య( Surya ) గురించి ఎంత చెప్పినా తక్కువే.ఇప్పటికే కంగువా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు.

 Surya As A Producer For Family Movies , Karti, Surya, Jyotika, Producer , Family-TeluguStop.com

ఈ సినిమా తర్వాత మరొక ఆరు సినిమాలను లైన్లో పెట్టేసాడు.అయితే హీరోగా సినిమాలలో లైన్లో పెట్టడం సూర్యకి పెద్ద విషయమేమీ కాదు కానీ నిర్మాతగా కూడా ఇంత వరకు ఏ హీరో లేనంత బిజీగా చిత్రాలను ఒకటి తర్వాత ఒకటి అనౌన్స్ చేస్తూ తనకు ఎవరూ పోటీలేరు సాటి లేరు అనే విధంగా అలరిస్తున్నాడు.

ఇప్పటి వరకు నిర్మాతగా చాలానే సినిమాలను తెరకెక్కించిన సూర్య ముఖ్యంగా తన కుటుంబ చిత్రాలనే ఎక్కువగా ఎంకరేజ్ చేస్తున్నాడు.

Telugu Jyotika, Karti, Kollywood, Surya-Telugu Top Posts

సూర్య భార్య అయిన మాజీ హీరోయిన్ జ్యోతిక( Jyotika ) రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎక్కువ సినిమాలు సూర్య బ్యానర్ లోనే నిర్మించడం విశేషం.జ్యోతిక 36 వయదినిలే అనే సినిమాతో మరోసారి లీడ్ క్యారెక్టర్ తో ఎంట్రీ ఇవ్వగా ఆ తర్వాత మరో నాలుగైదు సినిమాలు తన సొంత బ్యానర్ లోనే సూర్య జ్యోతికను హీరోయిన్ గా పెట్టి తెరకెక్కించగా అవన్నీ కూడా మంచి హిట్ టాక్ తెచ్చుకున్నాయి.ఓవైపు పసంగ 2( pasanga 2 ) వంటి ప్రయోగాత్మక చిత్రాలను కూడా సూర్య తెరకెక్కిస్తునే తన తమ్ముడు కార్తీ మరియు భార్య జ్యోతికలతో కమర్షియల్ సినిమాలు తీస్తూ సక్సెస్ అవుతున్నాడు.

Telugu Jyotika, Karti, Kollywood, Surya-Telugu Top Posts

బార్య కాబట్టి ఆమెతో సినిమాలు తీశాడు అని అనుకోవడానికి లేదు.తన తమ్ముడు కార్తీ ( Karti )కూడా కెరియర్ పరంగా కొంచెం ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సమయంలో నేనున్నాను అంటూ సూర్య ముందుకొచ్చి చిన్న బాబు సినిమా నిర్మించి తనను హిట్ ట్రాక్ ఎక్కించాడు.ఇక తాజాగా జపాన్ అనే సినిమా ద్వారా కార్తీ దారుణమైన డిజాస్టర్ ని ఎదుర్కొన్నాడు.అందుకే ఇప్పుడు ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో సూర్య నిర్మాతగా మారి మరో సినిమాను తెరకెక్కిచే పనిలో ఉన్నాడు.

ఈ సినిమా కార్తీకి ఖచ్చితంగా మంచి విజయాన్ని అందిస్తుందని వారి అభిమానులు ఆశిస్తున్నారు.ఇలా ఫ్యామిలీ ప్యాకేజ్ తో సినిమాలు నిర్మించి కుటుంబానికి అవసరమైనప్పుడల్లా నేనున్నాను అంటూ సూర్య ముందుకు రావడం ఆయన అభిమానులను ఎంతగానో ఉత్సాహ పరుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube