నన్ను నమ్ముకున్న వారిని రిస్క్‌ లో పెట్టడం ఇష్టం లేక వచ్చేశానంటున్న సూర్య

సూర్య హీరోగా సుధ కొంగర దర్శకత్వంలో రూపొందిన ‘ఆకాశమే నీ హద్దురా’ సినిమా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అద్బుతమైన ఈ సినిమా ఓటీటీ ద్వారా రావడం వల్ల థియేటర్‌ ఎక్స్‌పీరియన్స్‌ను మిస్‌ అయ్యాం అంటూ చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 Surya About Ott Release Of Aakasam Nee Haddura Movie ,surya, Aakasam Nee Haddura-TeluguStop.com

ఈవిషయంలో అభిమానులతో పాటు సినీ వర్గాల వారు మరియు విశ్లేషకులు కూడా అదే స్పందన తో ఉన్నారు.ఆకాశమే నీ హద్దురా సినిమా థియేటర్లలో విడుదల అయ్యి ఉంటే తెలుగు మరియు తమిళం కలిపి ఖచ్చితంగా వంద కోట్లకు పైగా వసూళ్లు నమోదు అయ్యేవి అంటూ నమ్మకంగా చెబుతున్నారు.

ఈ విషయంలో ప్రతి ఒక్కరు సూర్య నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు.ఎన్నో పెద్ద సినిమాలు పూర్తి అయిన తర్వాత ఆగిపోయాయి.

కాని మీరు మాత్రం ఎందుకు ఆపలేక పోయారు అంటూ సూర్యను ప్రశ్నిస్తున్నారు.ఒక మంచి సినిమాను బుల్లి తెరపై తీసుకు రావడం వల్ల సినిమా ఫీల్‌ ను పోగొట్టారు మరియు మీరు చేసిన పని వల్ల ఇతర సినిమాల యొక్క ఆలోచన తీరు కూడా మారిందని అంటున్నారు.

ఈ విషయమై సూర్య స్పందించాడు.ఒక సినిమాను నిర్మించిన సమయంలో కోట్లు దానిపై పెట్టి ఉంటాం.అన్ని డబ్బులు పెట్టినప్పుడు నెలలకు నెలలు సినిమాను వాయిదా వేయడం వల్ల కోట్లల్లో నష్టం వచ్చే అవకాశం ఉంటుంది.ఆతర్వాత సినిమా విడుదలై సక్సెస్‌ అయినా కూడా ఎక్కువ ప్రయోజనం ఉండదు.

అందుకే సినిమా ఆర్థికపరమైన కారణాల వల్ల విడుదల విషయంలో ఓటీటీ వైపు అడుగులు వేయాల్సి వచ్చిందని ఈ సందర్బంగా ఆయన అన్నాడు.సినిమా నిర్మాణంలో నాతో పాటు ఇంకా కొందరు పెట్టుబడి పెట్టి ఉన్నారు.

Telugu Aakasamnee, Lockdown Effect, Ott, Sudha Kongara, Surarai Potru, Surya, Te

కనుక వారిపై ఆర్థికపరమైన భారం పెట్టకూడదు అనే ఉద్దేశ్యంతోనే నేను నా సినిమాను ఓటీటీ ద్వారా విడుదల చేశాను.నన్ను నమ్ముకుని పెట్టుబడి పెట్టిన వారిని రిస్క్‌ లో పెట్టి నా స్వార్థం కోసం నేను ఓటీటీ లో విడుదల చేయకుంటే వారికి అన్యాయం జరుగుతుందని అనిపించింది.అందుకే ఈ నిర్ణయానికి రావాల్సి వచ్చిందని సూర్య కుండబద్దలు కొట్టేశాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube