పంచె కట్టులో ఖడ్గం పట్టుకొని వెళ్తున్న సూర్య... కొత్త సినిమా ఫస్ట్ లుక్

సౌత్ ఇండియన్ హీరోలలో ఎప్పుడూ ప్రయోగాలకి పెద్దపీట వేసే హీరోలు ఎక్కువగా కోలీవుడ్ లోనే ఉంటారు.ఓ వైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరోవైపు ప్రయోగాలు కూడా కోలీవుడ్ హీరోలు చేస్తూ ఉంటారు.

 Surya 40th Movie First Look Reveal, Tollywood, Kollywood, Pandiraj, Hero Surya-TeluguStop.com

అలాగే ప్రయోగాలు చేసే వారిలో సూర్య ముందు వరుసలో ఉంటాడని చెప్పాలి.ఈ కారణంగానే అతని సినిమాలకి కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంటుంది.

రీసెంట్ గా సుధా కొంగర దర్శకత్వంలో సూర్య నటించిన సూరైపోట్రూ సినిమా తెలుగులో ఆకాశం నీ హద్దురా టైటిల్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చింది.తమిళంలో ఈ రేంజ్ ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అంతకు మించి తెలుగులో కూడా హిట్ అయ్యింది.

ఒటీటీ ద్వారా ఈ సినిమా రిలీజ్ అయినా తెలుగు ప్రేక్షకులు విపరీతంగా సినిమాని వీక్షించారు.ఇదిలా ఉంటే పాండి రాజ్ దర్శకత్వంలో సూర్య ప్రస్తుతం సినిమా చేస్తున్నాడు.

తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ ని రివీల్ చేశారు.ఈ లుక్ లో పంచెకట్టులో పెద్ద ఖడ్గం పట్టుకొని ఎక్కడికో యుద్ధానికి వెళ్తున్న వాడిలా సూర్య లుక్ ఉంది.

ఖడ్గం పట్టుకుని నడుస్తున్న తీరు చూస్తుంటే కథా నేపథ్యమే భిన్నంగా ఉండనుందనే విషయం అర్థమైంది.ఇది ఆయన కెరియర్లోనే సంథింగ్ స్పెషల్ మూవీ అని అభిమానులు చెప్పుకుంటున్నారు.

సన్ పిక్చర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో కథానాయికగా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తోంది.పాండి రాజ్ చివరిగా శివ కార్తికేయన్ గా సినిమా చేశాడు.

అంతకు ముందు కార్తితో చేసిన సినిమా చినబాబు టైటిల్ తో తెలుగులో కూడా రిలీజ్ అయ్యి హిట్ టాక్ సొంతం చేసుకుంది.ఇప్పుడు సూర్యని మాత్రం విలేజ్ బ్యాక్ డ్రాప్ లోనే యాక్షన్ హీరోగా ఈ సినిమాలో ఆవిష్కరిస్తున్నట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube