సర్వేలలో లెక్కలో లేని జనసేన! అసలు వ్యూహం ఇదేనా  

జనసేన ఊసే లేకుండా పొలిటికల్ సర్వేలు. .

Surveys Don\'t Like To Focus Janasena Influence-congress,janasena Influence,surveys Don\\'t Like To Focus,tdp,ysrcp

ఏపీలో మరో రెండు రోజులలో ప్రజలు ఓటింగ్ కి రెడీ అయిపోతున్నారు. ఇక ఎన్నికల ముందు ఏపీలో అన్ని రాజకీయ పార్టీలు తన ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇక నేటితో ప్రచారానికి కూడా ముగింపు పడే అవకాశం ఉంది..

సర్వేలలో లెక్కలో లేని జనసేన! అసలు వ్యూహం ఇదేనా-Surveys Don't Like To Focus Janasena Influence

ఇదిలా ఉంటే ఎన్నికల ముందు జాతీయ మీడియా సంస్థల నుంచి, స్థానికంగా కొన్ని మీడియాలు, సర్వే సంస్థలు తమ ఎన్నికల సర్వేలని విడుదల చేసాయి. అయితే ఈ సర్వేలు చూస్తూ ఉంటే అసలు ఏపీలో జనసేన పార్టీ ఉందా అనే అనుమానం కచ్చితంగా కలుగుతుంది.

తాజాగా విడుదల అవుతున్న సర్వేలలో ఏపీలో ప్రధానంగా వైసీపీ, టీడీపీ పార్టీల మధ్యనే ఉండబోతుంది అనే స్పష్టం చేయడంతో పాటు కొన్ని సర్వేలలో టీడీపీకి అనుకూలంగా ప్రీపోల్ సర్వే ఉంటే కొన్ని మాత్రం వైసీపీకి అనుకూలంగా రిజల్ట్ ఉండబోతుంది అని చెప్పుకోచ్చాయి.

ఇక ఈ రెండు పార్టీల తర్వాత ఏపీలో కాంగ్రెస్, బీజేపీ పార్టీల గురించి సర్వేలు ప్రస్తావించాయి కాని మూడో ప్రత్యామ్నాయంగా ఉన్న జనసేన పార్టీని అసలు ప్రస్తావించకపోవడం, అలాగే ఆ పార్టీకి సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతుందని చూపించడం ద్వారా ఈ సర్వేలలో నిజాలు ఎంత ఉన్నాయి అనేది సుస్పష్టం.

ఈ సారి ఏపీలో మూడో ప్రత్యామ్నాయంగా ఉన్న జనసేన పార్టీని కనీసం లోకల్ మీడియా కూడా సర్వేలలో ప్రస్తావించాలేదంటే నిజంగా జనసేన ప్రభావం లేదని ఒప్పుకోవాలో, లేక జనసేన ప్రభావం ఉండకూడదు అని ప్రజలని ఈ సర్వేలతో ప్రభావితం చేస్తున్నారని చెప్పాలో అర్ధం కాని పరిస్థితి. ఏపీ రాజకీయాలో జనసేన కచ్చితంగా కింగ్ మేకర్ గా ఉండబోతుంది అని ఓ వైపు రాజకీయ విశ్లేషకులు చెబుతూ ఉంటే ఆ పార్టీకి సింగిల్ డిజిట్ సీట్లకే పరిమితం అవుతుందని చూపించడం గమనార్హం. పోనీ జనసేన పార్టీ తరుపున కనీసం 60 నియోజక వర్గాలలో బలమైన అభ్యర్ధులు ఉన్నారు. అలాగే యువతలో జనసేన మీద వేవ్ ఉంది.

మరి ఎందుకు జనసేన పార్టీని సర్వే సంస్థలు పరిగణంలోకి తీసుకోలేదు అనేది తెలియాలి.