జనసేన గ్రాఫ్ ఈ విధంగా ఉందా ? సర్వేల్లో తేలింది ఇదేనా ?  

Survey On Janasena Party For Ap Elections-election Survey In Ap Elections,janasena Party,pawan Kalyan Janasena,survey On Janasena Party,tdp,ys Jagan,ysrcp

 • ఏపీ ఎన్నికల్లో ప్రధానంగా టీడీపీ వైసీపీ, జనసేన, కాంగ్రెస్, బీజేపీ ఇలా అనేక పార్టీలు తలపడుతున్నా ప్రధాన పోటీ మాత్రం వైసీపీ, టీడీపీ మధ్యే అన్నట్టుగా ఉంది. ఈ రెండు పార్టీల అభ్యర్థుల గెలుపోటముల మీద అనేక సర్వేలు బయటకి వస్తున్నాయి.

 • జనసేన గ్రాఫ్ ఈ విధంగా ఉందా ? సర్వేల్లో తేలింది ఇదేనా ?-Survey On Janasena Party For AP Elections

 • ఒక సర్వే వైసీపీకి అనుకూలంగా వస్తే మరో సర్వేలో టీడీపీ కి అనుకూలంగా ఫలితాలు వస్తున్నాయి. ఈ సందర్భంలో జనసేన ప్రభావాన్నిమాత్రం ఏ సర్వేలోనూ స్పష్టంగా చెప్పలేకపోతున్నాయి.

 • ఆ పార్టీకి రెండు నుంచి ఐదు సీట్లు మాత్రమే రావొచ్చని చెబుతున్నాయి. కొన్ని కొన్ని సర్వేలు.

 • అసలు జనసేన ప్రస్తావన తీసుకు రాకుండా ఇతరులు అనే ఆప్షన్ లో వేసేస్తున్నారు.

  Survey On Janasena Party For AP Elections-Election In Ap Elections Janasena Pawan Kalyan Survey Tdp Ys Jagan Ysrcp

  ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరు చూస్తుంటే కనీసం 20 నుంచి 30 సీట్లు తప్పనిసరిగా వస్తాయి అనే ధీమాలో ఉన్నాడు. కర్ణాటకలో కుమారస్వామి ఏ విధంగా అధికారం దక్కించుకున్నాడో అదేవిధంగా తాను కూడా అధికారం దక్కించుకోవాలనే తాపత్రయంలో పవన్ ఉన్నాడు.

 • కానీ అదేసమయంలో కుమారస్వామి తన పార్టీని బలోపేతం చేసినట్టుగా పవన్ చేయలేకపోయాడు. ప్రస్తుత ఎన్నికల పరిస్థితి చూస్తే పవన్ ప్రభావం అంతంతమాత్రమే అన్నది స్పష్టం అవుతోంది.

 • కర్ణాటకలో జేడీఎస్‌లా బలీయమైన శక్తిగా జనసేన మారే పరిస్థితులు కనిపించడం లేదు. పైకి ఎన్ని చెప్పినా జనసేన నేతలు కూడా ఈ విషయాన్ని నమ్మడం లేదు.

 • జనసేన ఓటింగ్‌కు సంబంధించిన కీలకమైన అంశాల్లో స్ట్రాటజిక్ ఓటింగ్ ఒకటి. రాజకీయ పరిస్థితులో హోరాహోరీగా ఉన్న సమయంలో ఒకరిని ఓడించాలనో.

 • మరొకర్ని గెలిపించాలనే విధంగా రాజకీయ పరిస్థితులు ఉన్నప్పుడు ఓటింగ్ మారుతుంది. ఇప్పుడు ఏపీలో టీడీపీ వైసీపీల మధ్య పోరు ప్రధానంగా ఉంది.

 • ఇటువంటి పరిస్థితుల్లో చిన్న పార్టీలకు ఓటింగ్ వేసేందుకు కూడా ఓటర్లు పెద్దగా ముందుకు రారు. ఈ స్ట్రాటజిక్ ఓటింగ్ అనేది టీడీపీ, వైసీపీ అనేది రెండు పార్టీల్లోనూ ఉంది.

 • టీడీపీకి ఓట్లు వేయాలనుకునే వారు ఒక్క టీడీపీ ఓటర్లే కాకపోవచ్చు. అలాగే వైసీపీ ఇప్పుడు ఏపీలో బీజేపీ ఓటర్లు ఉన్నారు.

 • వారంతా చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వారు తమ పార్టీకి ఓటు వేయడం వల్ల ఆ ఓటు వృధా అవుతుంది అనే ఆలోచనలో వైసీపీ వైపు మొగ్గు చూపే అవకాశం కూడా లేకపోలేదు.