మగవారి కంటే ఆడవారిలోనే ఎక్కువ అంటున్న సర్వే  

Survey On Bed Room Secrets -

మారుతున్న కాలంతో పాటు మనుషులలో శృంగార కోరికలు ఎక్కువ అయిపోతున్నాయి.ఈ కోరికల కారణంగా కొంత మంది శృతి మించి ప్రవర్తిస్తూ దారుణాలకి కూడా పాల్పడుతున్నారు.

Survey On Bed Room Secrets

ఆహారపు అలవాట్లులో వచ్చిన తేడాలు వలన ఈ శృంగార కోరికలు అదుపు తప్పుతున్నాయి.ఇదిలా ఉంటే ప్రపంచంలో ఎక్కువగా ఎక్కడ చూసిన మగవారికి సంబంధించిన వ్యవహారాలు బయటకి వస్తాయి.

ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాల కారణంతో భర్తలని హత్యలు చేస్తున్న ఆడవాళ్ళ బాగోతాలు కూడా బయటకి వస్తున్నాయి.ఇదిలా ఉంటే తాజాగా యూకేలో లైంగిక సంబంధాలపై జరిపిన సర్వేలో ఆశ్చర్యం కలిగించే వాస్తవాలు బయటపడ్డాయి.

పురుషులకన్నా స్త్రీలలోనే లైంగిక వాంఛలు ఎక్కువగా ఉన్నాయని ఈ సర్వే తేల్చింది.యూకేకు చెందిన ప్రముఖ వెబ్ పోర్టల్ ఇల్లిసిట్ కౌంటర్స్ నిర్వహించిన సర్వేలో దాదాపు 42 శాతం మంది పురుషులు తమ భార్యలు, గర్ల్ ఫ్రెండ్స్ శృంగార సామర్థ్యం తమకి ఎక్కువ ఉందని చెప్పగా, 43 శాతం మంది మహిళలు తమ భర్తలు, బాయ్ ఫ్రెండ్స్ కన్నా తమ శృంగార సామర్థ్యం ఎక్కువగా ఉందని చెప్పడం విశేషం.

అయితే 2000 మంది జంటలపై జరిపిన ఈ సర్వేలో దాదాపు 72 శాతం మంది జంటలు తమ భాగస్వామి లైంగిక వాంఛ తీర్చడంలో విఫలమవుతున్నారని తెలియజేసారు.ఇక 52 శాతం మంది మహిళలు తమ జీవిత భాగస్వామి సరైన పడక సుఖం ఇవ్వకపోతే వేరేకరితో సంబంధం పెట్టుకుంటామని చెప్పగా, 56 శాతం మంది పురుషులు కూడా భార్య పడక సుఖం ఇవ్వకపోతే వేరొకరితో శారీరక సంబంధం పెట్టుకుంటామని చెప్పారు.

అయితే ఇలాంటి వింత కోరికలు కేవలం బ్రిటన్ లోకే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉండే అవకాశాలు ఉన్నాయని మానసిక అద్యయన వేత్తలు చెబుతున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు