వైసీపీలో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్న స‌ర్వే.. అంత‌మంది ఎమ్మెల్యేలు క‌ష్ట‌మే..

ఏపీ రాజ‌కీయాల‌ను చూస్తే వైసీపీకి అస‌లు ఇప్ప‌ట్లో తిరుగుంటుందా అనే డౌట్ రాక‌మాన‌దేమో.ఇప్ప‌టికే ఆ పార్టీ వ‌రుస ఎన్నిక‌ల్లో దుమ్ములేపుతోంది.

 Survey Creating Tremors In Ycp .. It Is Difficult For So Many Mlas .., Ycp, Ap P-TeluguStop.com

దీన్ని చూసిన రాజ‌కీయ మేథావులు అంద‌రూ సీఎం జగన్ ప్ర‌జ‌ల్లో చాలా స్ట్రాంగ్ గా ఉన్నార‌ని, ఇంకో ప‌దేండ్లు ఆయ‌న‌కు ద‌రిదాపుల్లో కూడా ఎవ‌రూ రాలేరంటూ చెబుతున్నారు.అయితే గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీలో చాలామంది జ‌గ‌న్ ఇమేజ్‌తోనే గెలిచిన వారే.

ఆయ‌న ముఖం చూసే ప్ర‌జ‌లు వీరిని గెలిపించారు.దీంతో వారంద‌రికీ ఇప్ప‌టికీ కూడా సొంత ఇమేజ్ ఏమీ లేకుండా పోయింద‌నే చెప్పాలి.

ఇక ఇప్పుడు జ‌గ‌న్ కూడా దీన్నే ఫాలో అవుతూ పాలన సాగిస్తున్నారు.రేప‌టి రోజున మ‌ళ్లీ ఎన్నిక‌లు గ‌న‌క వ‌స్తే మాత్రం త‌న‌ను చూసే ఓట‌యాల‌ని కోరుకుంటున్నారు.

రాబోయే రోజుల్లో ప్ర‌జ‌లు మంత్రులు లేదా ఎమ్మెల్యేల కంటే కూడా త‌న పనితీరును చూసే ఓయేయాల‌నే ప్లాన్‌లో జగనే తాపత్రయంగా ఉన్న‌ట్టు కనిపిస్తోంది.ఈ నేప‌థ్యంలో అస‌లు ఏపీలో వైసీపీ మంత్రులు లేదా ఎమ్మెల్యేలు, అలాగే ఎంపీల పనితీరుపై ఎలాంటి అభిప్రాయాలు వ్య‌క్తం చేస్తున్నార‌నే దానిపై ఇప్ప‌టికే చాలా ర‌కాల స‌ర్వేలు బ‌య‌ట‌కు వ‌చ్చాయ‌నే వార్తలు వ‌చ్చాయి.

Telugu Ap, Ap Poltics, Chandra Babu, Mlas, Ys Jagan-Telugu Political News

కాగా ఇప్పుడు పాపులర్ స‌ర్వేల సంస్థ అయిన ఆత్మసాక్షి మరో సారి సంచ‌ల‌న సర్వే చేసిన‌ట్టు తెలుస్తోంది.కాగా ఈ సర్వేలో మాత్రం సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.అవేంటంటే జగన్ పాలన మీద ఏపీ ప్ర‌జ‌లు ఎంతో సంతృప్తిగానే ఉన్నా కూడా త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లోని ఎమ్మెల్యేల పనితీరుపై చాలా వ‌ర‌కు వ్య‌తిరేక‌త ఉన్న‌ట్టు అర్థం అవుతోంది.151 మంది ఎమ్మెల్యేల్లో దాదాపుగా 66 మందికి ఏదో ఒక అవినీతి ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు.మ‌రీ ముఖ్యంగా ఒక 46 మంది ఎమ్మెల్యేలు అస‌లు మ‌ళ్లీ గెలుస్తారా అనే అభిప్రాయాలు ఈ స‌ర్వేలో వెల్ల‌డ‌య్యాయి. 11 మంది మంత్రులు క‌న‌సీం ఇమేజ్ లేకుండా ఉన్నార‌ని, వీరంతా మ‌ళ్లీ ఎన్నిక‌ల్లో గెలిచే ఆస్క‌రాం లేద‌ని చెబుతున్నారు.

మ‌రి జ‌గ‌న్ వీరిమీద ఎలాంటి ఫోక‌స్ పెడుతారో చూడాలి.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube