సర్వే: కరోనా వ్యాక్సిన్‌పై భారతీయుల అయిష్టత.. కారణాలివే..!!

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు జనం.బ్రిటన్‌లో ఫైజర్ వ్యాక్సిన్‌కు అక్కడి ప్రభుత్వం అత్యవసర వినియోగానికి అనుమతి మంజూరు చేసింది.

 Survey Reveals That 53 Percent Indians Don't Show Interest On Corona Vaccine, In-TeluguStop.com

దీంతో ఆ దేశానికి వెళ్లేందుకు ప్రజలు తహతహలాడుతున్నారు.కానీ విదేశీయులకు టీకా పంపిణీకి సంబంధించి యూకే ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు.

అయితే కరోనా వైరస్‌కు టీకా విషయంలో భారతీయుల అభిప్రాయం ఎలా ఉంది? ఎంత మంది టీకా తీసుకోడానికి అనుకూలంగా ఉన్నారు? వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే వేయించుకుంటారా? అనే అంశాలపై ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర ఫలితాలు వెల్లడయ్యాయి.
మనదేశంలో మెజార్టీ ప్రజలు కోవిడ్ వ్యాక్సిన్‌పై పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.

కరోనా వ్యాక్సిన్ వస్తే తొందరగా వెళ్లి వేయించుకోవాలనే ఆసక్తిని భారతీయులు చూపించడం లేదని ఆ సర్వే బయటపెట్టింది.వ్యాక్సిన్ వస్తే తీసుకోవడంపై 53 శాతం మంది ఎలాంటి అభిప్రాయానికి రావడం లేదు.

ఫలితాలు చూసిన తర్వాత వ్యాక్సినేషన్‌పై ఆలోచిస్తామని 43 శాతం మంది తేల్చి చెప్పగా, 10 శాతం మంది తమకు వ్యాక్సిన్‌పై అసలు ఇంట్రెస్ట్ లేదని కుండబద్ధలు కొట్టారు.

Telugu Corona Vaccine, Covid, Officials, Indians, Revealsindians-Telugu NRI

పోలియో, ఫ్లూ మొదలైన వ్యాక్సిన్ల విషయంలో భారత ఆరోగ్య అధికారులు గతంలో ఎదుర్కొన్న సంఘటనలు ప్రస్తుతం కోవిడ్ టీకా తీసుకునే విషయంలోనూ కనిపిస్తోంది.టీకా విషయంలో అయిష్టతకు ఆ మహమ్మారి తీవ్రస్థాయి దాటిపోవడం వల్ల ‘తమలో హెర్డ్ ఇమ్యూనిటీ’వచ్చిందని, ‘వ్యాక్సిన్ దుష్ప్రభావాలు’వంటి కారణాలను ఉదహరణగా పేర్కొన్నారు.తమ శరీరాల్లో కోవిడ్‌ను తట్టుకునే రోగనిరోధక శక్తి పెరిగిందని చాలా మంది చెప్పారు.

అలాంటప్పుడు వ్యాక్సిన్ ఎందుకని చాలా మంది అభిప్రాయపడ్డారు.టీకా తీసుకోవడానికి అయిష్టంగా ఉన్నవారి సంఖ్య మాత్రం ఒక నెల తగ్గి మరో నెల పెరగడం విశేషం.

అక్టోబరులో వీరు 61 శాతం ఉండగా.నవంబరు నాటికి 59కి చేరుకోగా.

డిసెంబరులో ఇది 69 శాతం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube