తన ప్రాణాలను పణంగా పెట్టి మరీ ఇతరుల కోసం తల్లి అవుతుంది.. ప్రపంచంలోనే గొప్ప మహిళలు  

Surrogacy In Canada-surrogacy

కెనడాకు చెందిన మారిసా గర్బం దాల్చిన సమయంలో తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదురయ్యాయి, ప్రతి రోజు ఏదో ఒక ఇంజీక్షన్‌ను తీసుకోవాల్సి వచ్చింది. ఎన్నో రకాల మందు ఇష్టం లేకుండానే తీసుకోవాల్సి వచ్చింది. ఆహార నియమాలు పాఠించాల్సి వచ్చింది...

తన ప్రాణాలను పణంగా పెట్టి మరీ ఇతరుల కోసం తల్లి అవుతుంది.. ప్రపంచంలోనే గొప్ప మహిళలు-Surrogacy In Canada

అయినా కూడా అవన్నీ కూడా తల్లి అయిన తర్వాత మర్చి పోయాను అంటుంది మారిసా. తాజాగా ఒక పాపాయికి జన్మనిచ్చిన మారిసా గతంలో నాలుగు సార్లు అబార్షన్‌ అయ్యింది. మరోసారి అబార్షన్‌ అయితే ప్రాణాలకు ప్రమాదం అంటూ వైధ్యులు సూచించారు.

అయినా కూడా మళ్లీ తల్లి కావాలని ఆమె భావించింది. ఈసారి మాత్రం ఆమె సక్సెస్‌ అయ్యింది. అయితే ఆమె తల్లి కావాలనుకుంది, తన కోసం కాదు, మరో తల్లి కోసం కావడం ఇక్కడ విశేషం.

కెనడాలో సరోగసీకి అధికారికంగా ఆమోదం ఉంది. అయితే సరోగసీ కోసం మాత్రం మహిళలు డబ్బులు తీసుకోకూడదు. డబ్బుల కోసం కాకుండా ఆత్మ సంతృప్తి కోసం అంటూ కెనడాలో కొన్ని వందల మంది తల్లులు అవుతున్నారు. మారిసా వంటి వారు ఎంతో మంది ఇతరుల పిల్లలను తమ కడుపుల్లో నవ మాసాలు మోసి, పుట్టిన కొన్ని క్షణాలకే వారికి ఇచ్చేస్తున్నారు.

ఇందుకోసం వారు ఏమాత్రం డబ్బు తీసుకోవడం లేదు. ఇతరుల కళ్లలో ఆనందం చూసేందుకు వారు ఈ పని చేస్తున్నారు. ఎంత గొప్పదైన ఈ అవకాశం తమకు వస్తుందని మారిసా వంటి మాతృమూర్తులు అంటున్నారు...

సరోగసీ పద్దతికి కెనడాలో డబ్బులు తీసుకోవడం నేరం. అయితే డబ్బు తీసుకోవడం నేరం కాకున్నా కూడా తాను డబ్బులు తీసుకునేదాన్ని కాదని, ఇతరులకు పిల్లలను కని ఇచ్చి, వారిని సంతోష పెట్టినప్పుడు వారి కళ్లలో చూసే ఆనందం మరియు వాత్సల్యం ఎంత పెట్టినా దొరకదు అంటూ మారిసా అంటోంది. ఒక్కమారిసా మాట మాత్రమే కాదు అక్కడ వందలాది మంది తల్లుల మాట కూడా ఇదే. డబ్బు కంటే వారి కుటుంబం నిలబడుతుందని, వారి జీవితాల్లో సంతోషం నిండుతుందనే ఉద్దేశ్యంతో తాము అలా చేస్తున్నామని అంటున్నారు.

ఒక మహిళ మరో మహిళ కళ్లలో ఆనందం చూసేందుకు ప్రాణాలను కూడా లెక్క చేయకుండా తల్లి అయ్యేందుకు సిద్దం అవ్వడం అది కూడా ఉచితంగా సిద్దం అవ్వడం అనేది చాలా గొప్ప విషయం. అందుకే అక్కడి మహిళలు ప్రపంచంలోనే గొప్ప వారు అంటూ ప్రచారం జరుగుతుంది.