పనసపండును రెగ్యులర్ గా తింటే ఎన్ని లాభాలో తెలుసా?  

  • వేసవికాలంలో ఎక్కువగా వచ్చే పనసపండు అంటే ఇష్టపడని వారు అంటూ ఎవరు ఉండరు. ఇతర పండ్ల కన్నా భిన్నమైన రుచిలో ఉంటుంది. ఈ పండు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. పనసపండు తినటం వలన తక్షణ శక్తి లభిస్తుంది. పనసపండులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం.

  • పనసపండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఒత్తిడిని తగ్గించి మానసిక మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. అంతేకాక పనసలో ఉండే విటమిన్ సి గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది.

  • -

  • పనసపండులో కెరోటినాయిడ్లు సమృద్ధిగా ఉండుట వలన రక్తపోటు,కొలెస్ట్రాల్,మధుమేహం ఉన్నవారికి చాలా బాగా సహాయపడుతుంది.

  • వయస్సు రీత్యా వచ్చే ముడతలను తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. ఈ పండును తినటం వలన ముడతలు తొందరగా రాకుండా చర్మం యవ్వనంగా ఉంటుంది.

  • పనసపండ్లు తియ్యగా ఉన్నా సరే మధుమేహం వ్యాధిగ్రస్తులకు చాలా మంచిది. ఈ పండులో ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండుట వలన రక్తంలో ఒక్కసారిగా చక్కర స్థాయిలు పెరగవు. అందువల్ల మధుమేహం ఉన్నవారు నిరభ్యంతరంగా తినవచ్చు.

  • పనసపండులో విటమిన్ ఎ, సి లు ఉండుట వలన రోగ నిరోధక శక్తి పెరిగి వైరల్ ఇన్‌ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది.