చర్మ సమస్యలకు చెక్ పెట్టె వైట్ వెనిగర్.... ఎలా ఉపయోగించాలో తెలుసా?

ఆస్త్రింజేంట్ లక్షణాలు కలిగిన వైట్ వెనిగర్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ గా పనిచేసి మొటిమలు,నల్లని మచ్చలు,బ్లాక్ హెడ్స్,పిగ్మేంటేషన్ వంటి ఎన్నో చర్మ సమస్యల పరిష్కరానికి సహాయపడుతుంది.తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రభావవంతంగా పనిచేస్తుంది.

 White Vinegar, Skin Uses, White Vinegar Uses-TeluguStop.com

అయితే వైట్ వెనిగర్ ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.

ఒక స్పూన్ ఉల్లిపాయ రసంలో ఒక స్పూన్ రోజ్ వాటర్,ఒక స్పూన్ వైట్ వెనిగర్ వేసి బాగా కలపాలి.

ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నిముషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇది పిగ్మేంటేషన్ తొలగించటానికి చాలా బాగా సహాయపడుతుంది.మంచి ఫలితం కోసం వారంలో ఒకసారి ఈ విధంగా చేయాలి.

ఒక స్పూన్ బియ్యం పిండిలో ఒక స్పూన్ రోజ్ వాటర్,ఒక స్పూన్ వైట్ వెనిగర్ వేసి బాగా కలపాలి.

ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నిముషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే చర్మం మృదువుగా,కాంతివంతంగా మారుతుంది.

Telugu Skin, White Vinegar-Telugu Health - తెలుగు హెల్త్

రెండు స్ట్రా బెర్రీలను పేస్ట్ గా చేసి దానిలో ఒక స్పూన్ వైట్ వెనిగర్ వేసి బాగా కలిపి ముఖానికి పట్టించి 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే బ్లాక్ హెడ్స్ సమస్య తొలగిపోతుంది.

ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ లో ఒక స్పూన్ వైట్ వెనిగర్ కలిపి ముఖానికి రాసి 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే చర్మంలో పొడి తగ్గి తేమ పెరుగుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube