వోడ్కా వలన కలిగే అద్భుతమైన లాభాలు   Surprising Advantages Of Vodka     2016-08-17   06:00:12  IST  Lakshmi P

వోడ్కా … చాలామందికి ఇదో ఫెవరేట్ డ్రింక్. ఇక రిచ్ సొసైటిల్లో అబ్బాయి, అమ్మాయి తేడా లేకుండా ఎక్కువమంది తాగే డ్రింక్ ఇది. ఆల్కాహాల్ శాతం అత్యధికంగా ఉండే డ్రింక్ ఇదే. కాని ఇది కేవలం నష్టాలనే మోసుకురాదు. వోడ్కా వలన కొన్ని అద్భుతమైన లాభాలు కూడా ఉన్నాయి. అందుకే దీన్ని ఇటు ఔషధంగా, అటు విషంగా చెబుతారు మెడికల్ సైంటిస్టులు. ఈరోజుకైతే నష్టాలను పక్కనపెట్టి, వోడ్కా వలన కలిగే లాభాలని తెలుసుకుందాం.

* స్ట్రెస్, డిప్రేషన్ లాంటి సమస్యల నుంచి వెంటనే ఉపశమనం కలిగించే మందు లాంటిది వోడ్కా. ఎలాంటి మానసిక ఒత్తిడైనా, ఇలా వోడ్కా నోట్లో పడగానే, అలా వెళ్లిపోతుంది.

* వోడ్కాలో అసలు ఫ్యాట్ కంటెంటే ఉండదు తెలుసా! ఇది తక్కువ కాలరీలు కలిగి ఉంటుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారిని వోడ్కా కొద్ది కొద్దిగా తాగొచ్చు.

* వోడ్కాలో యాంటిసెప్టిక్, యాంటిటాక్సిన్ మరియు డిస్ ఇంఫెక్టెంట్ లక్షణాలు ఉంటాయి.

* తగిన మోతాదులో తీసుకుంటే రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది వోడ్కా.

* జ్వరం వస్తే వోడ్కాని ఛాతికి, కాళ్ళకి, నుదురుకి రాస్తే జ్వరం త్వరగా తక్కువయ్యే అవకాశం ఉంటుంది. ఈ విషయం కొన్ని అధ్యయనాల ద్వారా బయటపడింది.

* నిద్రలేమితో బాధపడేవారికి వోడ్కా గొప్ప వరం లాంటిది. ఒక షాట్ అలా వేసుకుంటే, కొద్ది సమయంలోనే నిద్రలోకి జారుకోవచ్చు.

* డాక్టరు చెప్పిన పద్ధతిలో వోడ్కా సేవిస్తే చావు త్వరగా రాదని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి.