ఆస్కార్ రేసు నుంచి తప్పుకున్న సూర్య ఆకాశం నీ హద్దురా మూవీ...

లాక్ డౌన్ సమయంలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో ఆకాశం నీ హద్దురా సినిమా ఒటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చిన సంగతి తెలిసిందే.ఎయిర్ ఇండియా గోపీనాథ్ జీవిత ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా డిజిటల్ లో రిలీజ్ అయ్యి అద్బుతమైన హిట్ సొంతం చేసుకుంది.

 Suriya's Soorarai Pottru Out Of Oscars Race, Suriya, Soorarai Pottru,aakasam Ne-TeluguStop.com

ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మానందం పట్టారు.సూరై పోట్రు టైటిల్ తో తమిళ్ లో తెరకెక్కిన ఈ సినిమా ఆకాశం నీ హద్దురా టైటిల్ తో తెలుగులో రిలీజ్ అయ్యింది.

ఇక తెలుగు, తమిళ్ రెండు బాషలలో సూపర్ హిట్ టాక్ ని ఈ సినిమా సొంతం చేసుకుంది.ఇక ఇందులో సూర్యకి జోడీగా అపర్ణ బాలమురళీ హీరోయిన్ గా నటించింది.

బలమైన కంటెంట్ ఉంటే ఎక్కడైనా సినిమాకి మంచి టాక్ వస్తుందని ఆకాశం నీ హద్దురా ప్రూవ్ చేసుకుంది.ఇదిలా ఉంటే ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకోవడమే కాకుండా ఏకంగా ఇండియా నుంచి ఆస్కార్ కి నామినేట్ అయ్యింది.

Telugu Aakasamnee, Oscar, Oscar Race, Oscars, Soorarai Pottru, Sudha Kongara, Su

ఇక ఆస్కార్ కి నామినేట్ అయిన ఇతర ఇండియా చిత్రాలతో పోటీ పడుతూ ఆస్కార్ ఎంట్రీని కూడా సొంతం చేసుకుంది.ఉత్త విదేశీ చిత్రాల కేటగిరీలో ఆస్కార్ ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా ఊహించని విధంగా అక్కడ మొదటి రౌండ్ లోనే ఆస్కార్ కమిటీ సభ్యుల నుంచి తిరస్కరణకి గురై తప్పుకుంది.ఎప్పటిలాగే ఇండియన్ సినిమాలు ఆస్కార్ బరిలో నిలబడలేవని ఆ కమిటీ తెల్చేసినట్లు అయ్యింది.ఇండియన్ సినిమాకి ఆస్కార్ గౌరవం ధక్కకున్న కచ్చితంగా ఈ సినిమాకి నేషనల్ అవార్డ్స్ రావడం పక్కా అనే టాక్ వినిపిస్తుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాని హిందీలో అజయ్ దేవగన్ లీడ్ రోల్ లో సుధా కొంగర దర్శకత్వంలో రీమేక్ చేయడానికి ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ రంగం సిద్ధం చేస్తుందనే టాక్ వినిపిస్తుంది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube