అరుదైన ప్రపంచ రికార్డుని ఖాతాలో వేసుకున్న ఆకాశం నీ హద్దురా చిత్రం

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గత ఏడాది సుధా కొంగర దర్శకత్వంలో సూరరైపొట్రు సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.ఈ సినిమా తెలుగులో ఆకాశం నీ హద్దురా టైటిల్ తో డబ్ అయ్యింది.

 Suriya's 'soorarai Pottru' Now Third Highest Rated Film On Imdb, Tollywood, Sudh-TeluguStop.com

అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.అమెజాన్ కి సౌత్ నుంచి భారీ ఆదాయం తీసుకొచ్చింది.

అలాగే ఈ సినిమా ఆస్కార్ కి నామినేట్ కూడా అయ్యింది. ఆస్కార్‌ అవార్డుల పోటీల బరిలో ఉత్తమ చిత్రం కేటగిరిలో, ఉత్తమ కథానాయకుడు, ఉత్తమ కథానాయకి నామినేషన్లో ఢీ కొట్టే వరకు వెళ్లింది.

పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శించబడిన ఈ మూవీ షాంఘాయ్‌ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ఉత్తమ దర్శకురాలిగా సుధా కొంగర, ఉత్తమ కథానాయకుడిగా సూర్య, ఉత్తమ కథానాయకిగా అపర్ణ బాలమురళికి అవార్డులను తెచ్చిపెట్టింది.

తాజాగా మరో అరుదైన రికార్డు ఈ మూవీ సొంతం చేసుకుంది.

ప్రపంచంలోనే అత్యధిక రేటింగ్‌ సాధించిన 1000 చిత్రాల్లో సూరరై పోట్రు మూడో స్థానంలో నిలిచింది.ఐఎమ్‌డీబీ వెబ్‌సైట్‌ సర్వేలో 9.3 రేటింగ్‌ ని సూరరై పొట్రు సొంతం చేసుకొని ప్రపంచంలో మూడో ఉత్తమ చిత్రంగా గుర్తింపు సొంతం చేసుకుంది.దీనికంటే ముందుగా ది షషాంక్‌ రెడెంప్షన్‌, ది గాడ్‌ ఫాదర్‌ చిత్రాలు మాత్రమే ఉండటం విశేషం.

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజాదారణ ఉన్న చిత్రాల జాబితాలో ఇండియా నుంచి అది కూడా కోలీవుడ్ కి చెందిన ఈ మూవీ నిలబడటం నిజంగా గొప్ప విషయం అని చెప్పాలి.ఇదిలా ఉంటే సుధా కొంగర నెక్స్ట్ మూవీని టాలీవుడ్ లో ఓ బిగ్ స్టార్ తో చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube