24 న సూర్య 24 టీజర్     2016-02-09   02:11:24  IST  Raghu V

విభిన్న తరహా పాత్రలు చేస్తూ మాస్ క్రేజ్ తెచ్చుకోవడం చాలా కష్టం కానీ హీరో సూర్య మాత్రం విభిన్న సినిమాలు చేస్తూ నే మంచి క్రేజ్ ని మూట గట్టుకున్నాడు. సూర్య కొత్త సినిమా 24 మనం సినిమా ఫేం డైరెక్టర్ తెరకి ఎక్కించిన ఈ సినిమా త్వరలో విడుదల కాబోతోంది అయితే ఈ లోగా టీజర్ ని విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఫస్ట్ లుక్ లో సూర్య పాత్ర గురించి మూడు విభిన్న షేడ్స్ తో రిలీజ్ చేసిన మూడు పోస్టర్స్ అందరినీ ఆకట్టుకోవడంతో అంచనాలు ఆకాశాన్ని అంటాయి. ఇప్పుడు తమిళ మీడియా ద్వారా ఆ సినిమాకి సంబంధించిన టీజర్ రిలీజ్ డేట్ గురించి వివరాలు తెలిసాయి. పేరుకు తగ్గట్లుగా ’24’ సినిమా టీజర్ ని ఈ నెల ’24’ విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో సమంత, నిత్యామీనన్ సూర్య కి జోడీగా నటిస్తున్నారు. విక్రమ్ కుమార్ చెప్పిన కథ తనకు బాగా నచ్చడంతో సూర్య తనే స్వంతంగా 2D ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఏప్రిల్ లో తమిళ నూతన సంవత్సరం రోజున ఈ సినిమా రిలీజ్ కావచ్చని భావిస్తున్నారు. తెలుగులో ఈ సినిమాని నితిన్ రిలీజ్ చేయనున్నారు.