మళ్లీ రూటు మార్చిన సూర్య.. ఐదేళ్లు పట్టిందన్న హీరో  

Suriya Turns As A Singer After 5 Years-kollywood News,singer,soorarai Pottru,suriya

తమిళ స్టార్ హీరో సూర్య ఇటీవల గడ్డుకాలం ఎదుర్కొంటున్నాడు.నటించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద బిచాణా ఎత్తేస్తుండటంతో సూర్య ఆందోళనలో పడ్డాడు.కాగా తాజాగా సూర్య ‘సూరరై పోట్రు’ అనే సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమా కోసం సూర్య తన రోల్‌ను మార్చినట్లు తాజాగా చిత్ర యూనిట్ పేర్కొంది.

Suriya Turns As A Singer After 5 Years-kollywood News,singer,soorarai Pottru,suriya Telugu Tollywood Movie Cinema Film Latest News Suriya Turns As A Singer After 5 Years-kollywood News Singer Soorarai-Suriya Turns As A Singer After 5 Years-Kollywood News Singer Soorarai Pottru

గతంలో 2014లో అంజాన్ చిత్రం కోసం సూర్య ‘ఏక్ దో తీన్’ అనే పాటను పాడాడు.ఇప్పుడు 5 ఏళ్ల తరువాత మళ్లీ సూర్య గాయకుడి అవతారమెత్తాడు.హిప్‌హాప్ రాప్ పాటగా ‘మారా.’ అనే పాటను సూర్య పాడినట్లు చిత్ర యూనిట్ తెలిపింది.ఈ సినిమాలో పాట పాడటం నిజంగా ఆనందాన్ని కలిగించిందని సూర్య తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశాడు.

జీవీ ప్రకాష్ అందించిన సంగీతం ఈ సినిమాకు చాలా బలాన్ని చేకూరుస్తుందని సూర్య పేర్కొన్నాడు.

ఏదేమైనా తమ అభిమాన నటుడు యాక్టర్ నుండి సింగర్‌గా మారడానికి ఐదేళ్లు పట్టిందని, అయినా తమ హీరో ఆల్‌రౌండర్ అంటూ సూర్య ఫ్యాన్స్ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈ సినిమాలో పలువురు ప్రముఖులు నటిస్తుండగా ఈ సినిమాను 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్య స్వయంగా నిర్మిస్తున్నాడు.