సూర్యను పూర్తిగా వాడేస్తానంటోన్న బోయపాటి  

Suriya To Do Movie With Boyapati Sreenu, Suriya, Boyapati Sreenu, Balakrishna, Tollywood News - Telugu Balakrishna, Boyapati Sreenu, Suriya, Tollywood News

తమిళ స్టార్ హీరో సూర్య నటించిన రీసెంట్ మూవీ ‘ఆకాశమే నీ హద్దురా’ ప్రేక్షకులను మెప్పించడంలో పూర్తిగా సక్సెస్ అయిన సంగతి తెలిసిందే.ఈ సినిమా తరువాత సూర్య తన నెక్ట్స్ చిత్రాన్ని ఎవరితో తెరకెక్కిస్తాడా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.

TeluguStop.com - Suriya To Do Movie With Boyapati Sreenu

ఇక ఈ సినిమా తరువాత సూర్య ఓ స్ట్రెయిట్ తెలుగు చిత్రంలో నటించబోతున్నట్లు గతంలోనే వార్తలు వచ్చాయి.ఈ మేరకు కథలను కూడా సూర్య వింటున్నట్లు తెలుస్తోంది.
అయితే సూర్యను స్ట్రెయిట్ తెలుగు చిత్రంలో ఎవరు డైరెక్ట్ చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.కాగా మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసేందుకు రెడీ అవుతున్నాడని, బోయపాటితో ఈ సినిమాను తెరకెక్కించేందుకు దిల్ రాజు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.కాగా బోయపాటి ప్రస్తుతం నందమూరి బాలకృష్ణతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

TeluguStop.com - సూర్యను పూర్తిగా వాడేస్తానంటోన్న బోయపాటి-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఈ సినిమాతో అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చేందుకు బోయపాటి రెడీ అవుతున్నాడు.

ఇక సూర్యతో చేయబోతున్న సినిమాను తెలుగుతో పాటు తమిళంలోనూ తెరకెక్కించేందుకు దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడు.

త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఉండబోతున్నట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి.సింగం సిరీస్‌తో మాస్ ప్రేక్షకులను మెప్పించిన సూర్యను బోయపాటి ఎలాంటి సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాడా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

మాస్ చిత్రాల్లో తనదైన సత్తా చాటే సూర్యను బోయపాటి మరింత మాస్‌గా ఎలా చూపిస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది.ఆకాశమే నీ హద్దురా సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న సూర్య తన నెక్ట్స్ చిత్రంతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి అంటున్నారు ఆయన అభిమానులు.

#Boyapati Sreenu #Suriya #Balakrishna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు