ఆకాశమే నీ హద్దుగా.. మూడింటిలో ఒక్కటి వచ్చినా అద్బుతమే

సూర్య హీరోగా తమిళంలో రూపొందిన సూరారై పోట్రూ విడుదలై సూపర్‌ హిట్ అయ్యింది.అమెజాన్ ద్వారా విడుదల అయ్యింది కనుక వసూళ్ల పరంగా రికార్డులు నమోదు అవ్వలేదు.

 Suriya Soorarai Pottru Enters Oscars Under 3 Categoriese, Akashame Ne Haddura, S-TeluguStop.com

లేదంటే ఈజీగా 150 నుండి 200 కోట్ల వరకు ఈ సినిమా అన్ని భాషల్లో కలిపి విడుదల చేసేది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు నమ్మకంగా చెబుతున్నారు.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన సందడి ఏమీ లేదు.

ఇలాంటి సమయంలో మరోసారి సూరారై పోట్రూ గురించి చర్చించుకునే సమయం వచ్చింది.తెలుగు లో ఆకాశమే నీ హద్దు అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్‌ హిట్‌ అయిన ఈ సినిమా కు ఆస్కార్‌ రేసింగ్‌ లో ఛాన్స్ దక్కింది.

ఏకంగా మూడు విభాగాల్లో ఈ సినిమా అవార్డు కోసం పోటీ పడుతోంది.గత కొన్ని సంవత్సరాలుగా ఆస్కార్‌ అవార్డు రావడం ఏమో కాని కనీసం సౌత్‌ నుండి పోటీ పడుతున్న సినిమా లే కరువు అయ్యాయి.

అలాంటిది ఈ సినిమా ఏకంగా మూడు విభాగాల్లో నామినేసన్ ను దక్కించుకుంది.

ఆస్కార్ ఇండియా వారు చెప్పిన దాని ప్రకారం సూర్య సూరారై పోట్రూ సినిమా మూడు విభాగాల్లో గాను నామినేషన్‌ అయ్యింది.

మొదటగా ఉత్తమ చిత్రం గా రెండవది ఉత్తమ హీరో మూడవది ఉత్తమ హీరోయిన్ గా.ఈ మూడు విభాగాల్లో కూడా కనీసం ఒక్క దాంట్లో ఆస్కార్‌ వచ్చినా కూడా అద్బుతం ఆవిష్కారం అయినట్లే.హీరోయిన్‌ మరియు హీరో ల నటన పీక్స్ లో ఉంది.కనుక ఉత్తమ సినిమా విషయమై కాస్త అనుమానం ఉన్నా ఇద్దరిలో ఒకరికి అవార్డు మాత్రం పక్కా అన్నట్లుగా టాక్‌ వినిపిస్తుంది.

మొత్తానికి ఈ సినిమా నుండి మూడు నామినేషన్‌ లు దక్కించుకోవడం అరుదైన రికార్డు గా చెప్పుకుంటున్నారు.ముందు ముందు మరిన్ని ఇలాంటి సినిమాలు రావడానికి ఆస్కార్ నామినేషన్ ప్రేరణగా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube