Hero Surya: లేడీ అభిమాని మృతితో కన్నీళ్లు పెట్టుకున్న సూర్య.. ఒక ధ్రువతార వెలుగుతూ ఉంటుందంటూ?

సాధారణంగా సెలబ్రిటీలు చనిపోతే అభిమానులు బాధపడిన సంఘటనలు చాలా ఉన్నాయి.కానీ అభిమానులు చనిపోతే సెలబ్రిటీలు బాధపడిన సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు.

ఆ సెలబ్రిటీలకు బాగా ఎక్కువగా నచ్చిన అభిమానులు చాలా దగ్గరగా ఉన్న అభిమానులు చనిపోతే సెలబ్రిటీలు వారికి సంతాపం వ్యక్తం చేయడం లేదంటే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు.తాజాగా తమిళ హీరో సూర్య( Hero Surya ) కూడా అభిమాని చనిపోవడంతో కన్నీళ్లు పెట్టుకున్నారు.

కాగా ఇటీవల టెక్సాస్‌ లోని( Texas ) ఒక మాల్‌లో జరిగిన కాల్పుల ఘటనలో ఐశ్వర్య తాటికొండ( Aishwarya Thatikonda ) అనే ఒక యువతి మృతి చెందిన విషయం తెలిసిందే.ఐశ్వర్య మృతితో ఆమె కుటుంబంలో ఒక్కసారిగా తీవ్ర విషాధాలు నెలకొన్నాయి.అయితే తన అభిమాని అయిన ఐశ్వర్య చనిపోయిందన్న విషయం తెలుసుకున్న తమిళ హీరో సూర్య ఎమోషనల్ అయ్యారు.

ఆమె మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు.ఐశ్వర్య చిత్ర పటం వద్ద పూలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు.

Advertisement

అనంతరం ఐశ్వర్య కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ లేఖను రాశారు.మీ కుటుంబాన్ని ఏ విధంగా ఓదార్చాలో కూడా తెలియడం లేదు.

నాకు మాటలు కూడా రావడం లేదు.ఐశ్వర్య మృతి తీరని లోటు.టెక్సాస్‌ లో జరిగిన కాల్పుల ఘటనలో మీ కుమార్తె ఐశ్వర్య కన్నుమూయడం నిజంగా దురదృష్టకరం.

ఆమె ఎప్పటికీ మన జ్ఞాపకాల్లో నిలిచే ఉంటుంది.ఒక ధ్రువతార వెలుగుతూనే ఉంటుంది అంటూ ఐశ్వర్య తల్లిదండ్రులను ఓదార్చే ప్రయత్నం చేశారు హీరో సూర్య.

అలాగే ఇవి నీ మృతికి నివాళిగా రాస్తున్న అక్షరాలు కావు.నువ్వు నిజమైన హీరోవి.

అఖిల్ జైనాబ్ పెళ్లి అప్పుడేనట.. మూడు నెలల గ్యాప్ లో అక్కినేని హీరోల పెళ్లి జరగనుందా?
ఎంతో టాలెంట్ ఉన్నా లక్ లేక వెనుకబడిన సత్యదేవ్.. లక్ కలిసిరావట్లేదా?

నీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు నువ్వొక ధ్రువతారవు.నువ్వు చిందించే చిరునవ్వు, నీలో ఉన్న ప్రేమను పంచే వ్యక్తిత్వం ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకుతుంది అని లేఖలో రాసుకొచ్చారు.

Advertisement

కాగా మే 6న టెక్సాస్‌లోని ఒక మాల్‌ లో దుండగులు జరిపిన కాల్పుల్లో ఐశ్వర్య సహా ఏడుగురు మృతి చెందిన విషయం తెలిసిందే.

తాజా వార్తలు