సంచలన సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న సూర్య మూవీ !

తమిళ ఇండస్ట్రీలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో సూర్య ఒకరు.ఈయనకు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది.

 Suriya Pandiraj Movie Latest Update, Suriya, Pandiraj, Latest Update, Kollywood-TeluguStop.com

సూర్య సినిమాలు యావరేజ్ టాక్ తెచ్చుకున్న మంచి వసూళ్లు చేస్తాయి.గజినీ సినిమాతో పాపులర్ అయినా సూర్య తర్వాత అన్ని డిఫరెంట్ సినిమాలు తీస్తూ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు.

సూర్య నటించిన ప్రతి సినిమాను తెలుగులో కూడా విడుదల చేస్తూ ఉంటారు.

ఎప్పుడూ విభిన్నమైన కథలతో ఎంచుకుంటూ ప్రేక్షకుల ముందుకు వస్తాడు సూర్య.

అందుకే ఈయనకు ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే ఉంటుంది.ఈ మధ్యే విడుదల అయినాఆకాశం నీ హద్దురాసినిమా ద్వారా మంచి హిట్ అందుకుని ఫుల్ జోష్ లో ఉన్నాడు సూర్య.

కెప్టెన్ గోపినాథ్ నిజ జీవిత కథ ఆధారంగా ఆకాశం నీ హద్దురా సినిమాను తెరక్కించారు.

Telugu Akashmanee, Kollywood, Latest, Pandiraj, Sudha Konagara, Suriya, Suriyapa

దర్శకురాలు సుధా కొంగర ఈ సినిమాను కమర్షియల్ హంగులతో తెరకెక్కించడంలో ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది.సూర్య ఈ సినిమా హిట్ తో వచ్చిన జోష్ లో వరస పెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.ప్రస్తుతం ఈయన పాండిరాజ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.

ఇది ఈయన కెరీర్ లో 40 వ సినిమాగా తెరకెక్కుతుంది.అయితే ఈ సినిమా కూడా నిజ జీవిత సంఘటన ఆధారంగా తెరకెక్కుతోందని వార్తలు వస్తున్నాయి.

Telugu Akashmanee, Kollywood, Latest, Pandiraj, Sudha Konagara, Suriya, Suriyapa

త్వరలోనే ఫస్ట్ లుక్ తో మన ముందుకు రాబోతున్నాడు సూర్య.ఈ సినిమాను పొల్లాచ్చి లో జరిగిన సామూహిక అత్యాచారాల సంఘటన ఆధారంగా తెరకెక్కిస్తున్నారని ప్రచారం జరుగుతుంది.ఆ ఘటనకు కారణమైన దుర్మార్గులను శిక్షించే యువకుడి పాత్రలో సూర్య కనిపించబోతున్నాడని టాక్ వినిపిస్తుంది.ఇది ఇలా ఉంటె ఈ సినిమాకు ఇంకా టైటిల్ అనౌన్స్ చెయ్యలేదు.

త్వరలోనే టైటిల్ తో పాటు, ఫస్ట్ లుక్ కూడా విడుదల చేస్తారని దర్శకుడు తెలిపాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube