ఆస్కార్ కు నామినేట్ అయిన చిత్రాలు ఇవే!

ఆస్కార్ అవార్డును దక్కించుకోవాలి అని ఎక్కువగా సినీ ఇండస్ట్రీలో నటించే వారికీ ఉంటుంది.ఈ నేపథ్యంలోనే చాలా మంది ఆస్కార్ అవార్డును సొంతం చేసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

 Suriya Jai Bhim And Mohanlal Marakkar Nominated Oscars 2022, Jai Bhim Movie, Osc-TeluguStop.com

సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతోమంది ఆస్కార్ అవార్డును అందుకున్న విషయం తెలిసిందే.అంతేకాకుండా పలు సినిమాలు సూపర్ హిట్ అయ్యి ఆస్కార్ అవార్డులను సైతం గెలుచుకున్నాయి.

ఇకపోతే ఎప్పటి లాగే ఈసారి కూడా ఆస్కార్ అవార్డులకు సంబంధించిన షార్ట్ లిస్ట్ చేశారు.ఇక ఇందులో రెండు భారతీయ చిత్రాలు చోటు దక్కించుకున్నాయి.

ప్రతిష్టాత్మకమైన 94 వ ఆస్కార్ అవార్డుల రేసులో ఈసారి 2 భారతీయ చిత్రాలు నామినేట్ అయ్యాయి.అందులో ఒకటి తమిళ హీరో సూర్య నటించిన జై భీమ్ సినిమా కాగా, మరొకటి మోహన్ లాల్ నటించిన మరక్కార్ సినిమా.

ఆస్కార్ రేసులో మొత్తం 276 సినిమాలు షార్ట్ లిస్ట్ అవగా భారతీయ సినిమాలు జాబితాలో చోటు దక్కించుకున్నాయి.ఈ రెండు సినిమాలు కూడా సౌత్ ఇండస్ట్రీకీ చెందిన సినిమాలు కావడం విశేషం.

ఇకపోతే తమిళ హీరో సూర్య నటించిన జై భీమ్ సినిమా గత ఏడాది అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన విషయం తెలిసిందే.ఈ సినిమాకు పలువురు విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా దక్కాయి.

జస్టిస్ చంద్రు జీవిత కథతో పాటు వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.

Telugu Jai Bhim, Marakkar, Mohan, Oscar Awards, Suriya-Movie

ఈ సినిమాకు టీజీ జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.ఈ సినిమాలో హీరో సూర్య అమాయక గిరిజనులు తరపున పోరాడే లాయర్ చందు పాత్రలో నటించి మెప్పించారు.మలయాళం స్టార్ మోహన్ లాల్ నటించిన మరక్కార్ సినిమా గురించి మనందరికీ తెలిసిందే.

చారిత్రక కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రియదర్శన్ దర్శకత్వం వహించారు.సినిమా గత ఏడాది చివర్లో థియేటర్స్ లో విడుదలైన విషయం తెలిసిందే.

ఇది మలయాళ సినీ పరిశ్రమలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించలేకపోయింది ఇప్పటికీ భాస్కర్ బరిలో నిలిచింది.ఇక ఆయా కేటగిరీలకు చెందిన ఫైనల్ నామినేషన్లను, ఆస్కార్ కమిటీ ఫిబ్రవరి 8న ప్రకటించనుంది.

ఇక ఈ అవార్డుల వేడుక మార్చి 27న అమెరికాలో జరగనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube