మరోసారి తండ్రి కొడుకులుగా నటిస్తున్న హీరో సూర్య

సౌత్ ఇండియాలో తనకంటూ ఒక ఇమేజ్ ని సొంతం చేసుకున్న హీరో సూర్య.ఓ వైపు కమర్షియల్ సినిమాలు చేస్తూ, మరో వైపు డిఫరెంట్ కథలతో కూడా విభిన్న కథా చిత్రాలు చేస్తూ తన మార్క్ చూపించే సూర్య ఈ మధ్యకాలంలో వరుస ఫ్లాప్ లతో సతమతం అవుతున్నారు.

 Suriya To Play Dual Roles In Vetrimaaran Movie, Tollywood, Bollywood, Telugu Cin-TeluguStop.com

ప్రస్తుతం సుధా కొంగర దర్శకత్వంలో ఆకాశం నీ హద్దురా అనే సినిమా చేశాడు.ఈ సినిమా రిలీజ్ కి రెడీ అయ్యింది.

ఇది ఓ వ్యాపారవేత్త బయోపిక్ స్టొరీ.లాక్ డౌన్ కారణంగా సినిమా రిలీజ్ వాయిదా పడింది.

ఇప్పుడు సూర్య విభిన్న చిత్రాల దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్న వెట్రిమారన్ దర్శకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఇక ఈ సినిమాలో సూర్య మరోసారి ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.

ఈ సినిమాలో సూర్య తండ్రి కొడుకులుగా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.గతంలో సూర్య సన్నాఫ్ కృష్ణన్, రాక్షసుడు సినిమాలలో సూర్య తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం మెప్పించాడు.

మరోసారి అలాంటి పాత్రల్లోనే కనిపించబోతున్నాడు.ఈ సినిమా వెట్రి గత సినిమాల మాదిరిగానే మాస్ ఎలిమెంట్స్ తో మురికివాడల నేపధ్యంలో జరిగే కథతోనే ఉండబోతుంది అని టాక్ వినిపిస్తుంది.

ఈ సినిమాకి వాడి వాసల్ అనే టైటిల్ ని ఇప్పటికే కన్ఫర్మ్ చేశారు.త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube