నేను హాజరైన అన్ని పరీక్షల్లో ఫెయిల్ అయ్యాను.. సూర్య కామెంట్స్ వైరల్?

టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో స్టార్ హీరోగా గుర్తింపును సొంతం చేసుకున్న సూర్య గతేడాది ఆకాశమే నీ హద్దురా సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నారు.నీట్ పరీక్ష వల్ల ఒత్తిడికి గురై ముగ్గురు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ఈ ఘటనలపై తమిళనాడు సీఎం స్టాలిన్ సైతం విచారం చేశారు.

 Hero Suriya Appeals To Students Against Death By Suicide Details, Appeals To Stu-TeluguStop.com

ఈ ఘటనల నేపథ్యంలో సూర్య ఒక వీడియో ద్వారా కొన్ని విషయాలను పంచుకున్నారు.

లైఫ్ కంటే పరీక్ష పెద్దది కాదని సూర్య తెలిపారు.

ఎప్పుడైనా డిప్రెషన్ గా ఫీలైతే ఫ్రెండ్స్ తో ఎక్కువ సమయం గడపాలని సూర్య సూచనలు చేశారు.ఒత్తిడి, నిరాశ, నిస్పృహలు కొంత సమయం తర్వాత ఉండవని అయితే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకుంటే మాత్రం ఆ నిర్ణయం లైఫ్ ను ముగిస్తుందని సూర్య చెప్పుకొచ్చారు.

ఆత్మహత్య అనే నిర్ణయం తల్లిదండ్రులకు సైతం యావజ్జీవ శిక్ష అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూర్య అన్నారు.

ఒక బ్రదర్ లా తాను ఈ విషయాన్ని చెబుతున్నానని తాను చెప్పిన విషయాలను మరిచిపోవద్దని సూర్య పేర్కొన్నారు.

Telugu Appeals, Surya Responded, Medical, Neet, Suriya, Surya, Tamilanadu, Tamil

లైఫ్ కంటే పరీక్ష పెద్దది కాదని సూర్య సూచనలు చేశారు.తాను హాజరైన అన్ని పరీక్షల్లో ఫెయిల్ అయ్యానని సూర్య తెలిపారు.తనకు ఎక్కువ మార్కులు వచ్చేవి కాదని పరీక్షలు, మార్కులు మాత్రమే లైఫ్ లో ఉండవని సూర్య పేర్కొన్నారు.లైఫ్ లో ఎన్నో సాధించాలని ధైర్యం, దృఢ సంకల్పం ఉంటే ఏదైనా గెలవవచ్చని సూర్య కామెంట్లు చేశారు.

Telugu Appeals, Surya Responded, Medical, Neet, Suriya, Surya, Tamilanadu, Tamil

తమిళనాడు రాష్ట్రంలో 2017 సంవత్సరం నుంచి మొత్తం 17 మంది విద్యార్థులు ఈ విధంగా ఆత్మహత్య చేసుకున్నారు.తమిళనాడు ప్రభుత్వం సైతం ఆత్మహత్య ఘటనలను దృష్టిలో పెట్టుకుని నీట్ అర్హత పరీక్షకు సంబంధించిన సంస్కరణలు చేసింది.ఇంటర్ మార్కుల ద్వారా తమిళనాడు సర్కార్ మెడిసిన్ సీట్లు కేటాయించడానికి సిద్ధమైంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube