భార్యతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న సూర్య.. ఎన్నాళ్ళ తర్వాతనో ఇలా..

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి తెలియని సినీ ప్రేక్షకులు లేరు.ఈయనకు కోలీవుడ్ లో మాత్రమే కాదు ఇండియా అంతటా ఫ్యాన్స్ ఉన్నారు.

 Suriya And Jyothika Vacation Diaries Details, Suriya, Jyothika, Vacation , Hero Suriya, Suriya Jyothika Vacation, Vikram Movie, Surya Wife Jyothika, Surya Vaadi Vasal Movie, Surya Rolex, Surya Family-TeluguStop.com

సూర్య నటనకు ఫిదా అవ్వని ఫ్యాన్స్ లేరు అంటే అతియసోక్తి కాదేమో.గజినీ సినిమాతో తెలుగులో కూడా భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించు కున్నాడు సూర్య.

ఈ సినిమా తర్వాత ఈయనకు తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడింది.

 Suriya And Jyothika Vacation Diaries Details, Suriya, Jyothika, Vacation , Hero Suriya, Suriya Jyothika Vacation, Vikram Movie, Surya Wife Jyothika, Surya Vaadi Vasal Movie, Surya Rolex, Surya Family-భార్యతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న సూర్య.. ఎన్నాళ్ళ తర్వాతనో ఇలా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అప్పటి నుండి ఈయన నటించిన అన్ని సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు.

ఇక ఇటీవలే సూర్య కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమాలో క్యామియో రోల్ చేసిన విషయం తెలిసిందే.ఈ రోల్ కు విశేష స్పందన వచ్చింది.ఈ సినిమాతో మంచి స్పందన రావడమే కాకుండా సూపర్ హిట్ అవ్వడంతో ఈ సక్సెస్ ను సూర్య కూడా ఎంజాయ్ చేస్తున్నాడు.

ఇది ఇలా ఉండగా ఈయన తాజాగా తన భార్యతో వెకేషన్ కు వెళ్ళాడు.

సూర్య హీరోయిన్ జ్యోతిక ను పెళ్లాడిన విషయం తెలిసిందే.వీరిద్దరూ కోలీవుడ్ లోనే అన్యోన్య జంటగా పేరు తెచ్చుకున్నారు.

పెళ్లి తర్వాత కూడా ఎంతో సంతోషంగా తమ లైఫ్ లీడ్ చేస్తున్నారు.వీరికి ఇద్దరు పిల్లల కూడా ఉన్నారు.

అయితే వీరిద్దరూ కలిసి చాలా రోజుల తర్వాత వెకేషన్ ఎంజాయ్ చేయడానికి వెళ్లారు.

జ్యోతిక పెళ్ళికి ముందు గ్లామరస్ పాత్రలు చేసి మెప్పించింది.అయితే పెళ్లి తర్వాత మాత్రం ఈమె కంప్లీట్ గా ఫ్యామిలీకి ప్రిఫరెన్స్ ఇస్తూ ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేసింది.ఇక ఇప్పుడు ఈమె కూడా మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తుంది.

ఇలా ఎవరికీ వారు బిజీ లైఫ్ లీడ్ చేస్తున్నారు.దీంతో బిజీ లైఫ్ ను కొన్నాళ్ల పాటు పక్కన పెట్టి చాలా కాలం తర్వాత వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు.

వీరిద్దరూ కలిసి దిగిన ఈ వెకేషన్ ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.ఎంతో అనందంగా ఎంజాయ్ చేస్తున్న వీరి ఫోటోలు సోషల్ మాధ్యమాల్లో వైరల్ అవ్వడంతో ఫ్యాన్స్ ఈ ఫోటోలకు లైక్స్ తో మోత మోగిస్తున్నారు.ఇక సూర్య సినిమాల విషయానికి వస్తే ఈయన ప్రెసెంట్ వాడి వాసల్ సినిమా చేస్తున్నాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube