ఆకాశమే నీ హద్దురా ట్రైలర్ టాక్: సూర్య గట్టిగా కొట్టేలా ఉన్నాడు!

తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆకాశమే నీ హద్దురా’ ఎప్పుడో షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది.అయితే కరోనా కారణంగా సినిమా థియేటర్లు మూతపడటంతో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది.

 Suriya Aakasame Nee Haddura Trailer Released, Suriya, Aakasame Nee Haddura, Sudh-TeluguStop.com

ఇక ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సూర్య ఆసక్తి చూపడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కాగా ఈ సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 12న అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.ఈ ట్రైలర్ చూస్తుంటే సూర్య ఈ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడం ఖాయమని తెలుస్తోంది.

సామాన్యులకు విమానయానం అందుబాటులోకి తెచ్చేందుకు ఓ వ్యక్తి చేసే ప్రయత్నమే ఈ సినిమా కథ అని మనకు ట్రైలర్ చూస్తే ఇట్టే అర్థమవుతోంది.కాగా ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జీఆర్ గోపీనాథ్ జీవితకథ ఆధారంగా ఈ సినిమాను దర్శకురాలు సుధా కొంగర తనదైన తీరులో తెరకెక్కించారు.

ఇక ఈ సినిమాలో సూర్య నటన, ఆయన పండించిన ఎమోషన్స్ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లనున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.

మొత్తానికి ఈ సినిమాతో సూర్య మరోసారి అదిరిపోయే హిట్ అందుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

పేదలకు కూడా విమానయానం అందుబాటులోకి తెచ్చే ప్రయత్నంలో సూర్య ఎలాంటి ఛాలెంజ్‌లను ఎదుర్కొన్నాడు అనేది ఈ సినిమా కథగా ఉండనుంది.సుధా కొంగర ఈ సినిమాతో తన సక్సె్స్ ట్రాక్ కంటిన్యూ చేస్తుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.

కాగా ఈ సినిమాలో సూర్య సరసన అపర్ణ బాలమురళి హీరోయిన్‌గా నటిస్తోండగా, పలువురు నటీనటులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.ఈ సినిమాను సూర్య స్వయంగా ప్రొడ్యూస్ చేస్తుండగా జీవి ప్రకాష్ ఈ సినిమాకు బాణీలు అందిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube