స్టార్ హీరో సినిమాలకు బ్యాన్ తప్పదా?

తమిళ స్టార్ హీరో సూర్య వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నాడు.తాజాగా ఆకాశం నీ హద్దురా చిత్రంలో నటిస్తున్న సూర్య, అటు నిర్మాతగా కూడా పలు సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

 Suriya, Aakasam Nee Haddura, Theatres, Ott-TeluguStop.com

ఈ క్రమంలో సూర్య నిర్మించిన ఓ తమిళ సినిమా ఇప్పుడు అసలుకే ఎసరు తెచ్చే వరకు వచ్చింది.

సూర్య భార్య జ్యోతిక నటిస్తున్న తాజా చిత్రం ‘పొన్మగల్ వంధాల్’ను వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.

కానీ ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా నెలకొన్న లాక్‌డౌన్ వల్ల ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేసే అవకాశం లేకుండా పోయింది.దీంతో ఈ సినిమాను ఆన్‌లైన్‌లో రిలీజ్ చేసేందుకు సూర్య ప్రయత్నిస్తున్నాడు.

ఓటీటీ ప్లాట్‌ఫాంపై ఈ సినిమాను రిలీజ్ చేసి క్యాష్ చేసుకోవాలని సూర్య ప్లాన్ చేశాడు.కానీ ఆయన ప్లాన్‌కు థియేటర్ల యాజమాన్యాలు మండిపడుతున్నాయి.

సినిమాను అంత బడ్జెట్ పెట్టి తీసేది థియేటర్‌లో రిలీజ్ చేయడానికి.ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ చేస్తే చాలా మంది నష్టపోతారని వారు వాదిస్తున్నారు.దీంతో సూర్య ఈ ప్రయత్నాలు మానుకోవాలని, లేకపోతే ఆయన నటించే, నిర్మించే సినిమాలను బ్యాన్ చేయక తప్పదని వారు హెచ్చరించారు.మరి ఈ వివాదం ఎక్కడివరకు వెళుతుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube