సెన్సార్‌తో ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న సూర్య  

Suriya Aakaasam Nee Haddhura - Telugu Aakaasam Nee Haddhura, Kongara Sudha, Suriya, Tollywood News

తమిళ స్టార్ హీరో సూర్య నటించే సినిమాలకు ఇతర భాషల్లోనూ మంచి ఆదరణ లభిస్తోంది.అయితే సూర్య ఇటీవల నటిస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద వరుసగా ఫ్లాప్‌గా నిలుస్తుండటంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు.

 Suriya Aakaasam Nee Haddhura

కాగా గురు వంటి సినిమాను తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్న లేడీ డైరెక్టర్ సుధా కొంగర డైరెక్షన్‌లో సూరారై పొట్రు అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు సూర్య.ఈ సినిమాను తెలుగులో ‘ఆకాశమే నీ హద్దురా’ అనే టైటిల్‌తో తెలుగులో తెరకెక్కిస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

కాగా ఎయిర్ డెక్కన్ కెప్టెన్ గోపీనాథ్ జీవితాధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఎలాంటి కాన్సెప్ట్‌తో వస్తుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఇప్పటికే చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.

సెన్సార్‌తో ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న సూర్య-Gossips-Telugu Tollywood Photo Image

కాగా తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులను పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది.ఈ సినిమాకు సెన్సార్ బోర్డు వారు క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ జారీ చేశారు.

దీంతో చిత్ర యూనిట్ ఫుల్ ఖుషీగా ఉంది.

ఏప్రిల్‌లోనే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది.

ఇక థియేటర్లు తెరుచుకున్న వెంటనే ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సూర్య అండ్ టీమ్ రెడీ అవుతున్నారు.బయోపిక్ చిత్రంగా వస్తు్న్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

ఇక ఈ సినిమాను సూర్య స్వయంగా తానే ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమాపై మంచి క్రేజ్ ఏర్పడింది.కాగా ఈ సినిమా విజయం పట్ల చిత్ర యూనిట్ పూర్తి ధీమాగా ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test