కమల్ హాసన్' కు శస్త్రచికిత్స.. శృతిహాసన్ ఏం చెప్పిందంటే?  

Surgery for Kamal Haasan , Shruti Haasan , elections campaign, leg pain,social media,ramachandra hospiral,twitter,tamilanadu,makkal nidhi,akshara hasan - Telugu Elections Campaign, Leg Pain, Shruti Haasan, Surgery For Kamal Haasan

ప్రముఖ తమిళ సినీ స్టార్ కమల్ హాసన్ ఆరోగ్యం గురించి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తల గురించి తాజాగా తన కూతురు అక్షర హాసన్, శృతిహాసన్ ట్విట్టర్ ద్వారా కమల్ హాసన్ ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చారు.తన తండ్రి ఆరోగ్య పరిస్థితిపై ఏవేవో వార్తలు వస్తున్నాయని అయితే అవన్నీ కేవలం అపోహలు అంటూ తాజాగా తన కూతుర్లు ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ కమల్ హాసన్ కాలికి శాస్త్ర చికిత్స జరిగిందని వారు ఈ సందర్భంగా తెలియజేశారు.

TeluguStop.com - Surgery For Kamal Haasan What Did Shruti Haasan Say

చెన్నైలోనే ప్రముఖ రామచంద్ర హాస్పిటల్ లో కమల్ హసన్ కాలికి శస్త్ర చికిత్స చేసినట్లు తెలిపారు.అయితే నాలుగైదు రోజుల పాటు హాస్పిటల్ లోనే ఉండాలని డాక్టర్లు సూచించారు.

నాలుగైదు రోజుల తర్వాత ఒకసారి పరీక్షించి తనని డిస్చార్జ్ చేస్తున్నట్లు తెలిపారు.కాలికి ఆపరేషన్ చేయటం వల్ల కొన్ని రోజుల పాటు ఎక్కడికి బయటకు వెళ్లకుండా విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని తర్వాత వచ్చి ప్రజలందరిని కలుస్తారని ట్విట్టర్ వేదికగా కమల్ హాసన్ కూతుర్లు తెలియజేశారు.

TeluguStop.com - కమల్ హాసన్’ కు శస్త్రచికిత్స.. శృతిహాసన్ ఏం చెప్పిందంటే-General-Telugu-Telugu Tollywood Photo Image

ఈ సంవత్సరంలో తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో కమల్ హాసన్ పాల్గొంటూ మక్కల్‌ నీది మయ్యం పార్టీని స్థాపించినట్లు మనకు తెలిసిందే.ఇందులో భాగంగానే గత కొద్ది రోజుల నుంచి ఎన్నికల ప్రచారంలో ఉన్న కమల్ హాసన్ కాలికి తీవ్రమైన నొప్పి రావడంతో ఆసుపత్రికి వెళ్లడంతో ఆపరేషన్ నిర్వహించాలని డాక్టర్లు సూచించారు.దీంతో కమల్ హాసన్ కాలికి శస్త్ర చికిత్స చేసినట్లు, నాన్న పై చూపిన ప్రేమకు, అభిమానానికి కమల్ హాసన్ కూతురు ఇద్దరు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

.

#Shruti Haasan #SurgeryFor #Leg Pain

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు