13 గంటల్లో 10 ఆపరేషన్ లు ఎలాంటి విరామం లేకుండా!

వైద్య వృత్తి అంటేనే ఎన్నో బాధ్యతలతో కూడుకున్నది.ఆపద సమయంలో తమ ప్రాణాలను కాపాడే వైద్యుడి ని ప్రతి ఒక్కరూ కూడా దైవం లా భావిస్తూ ఉంటారు.

 Surgeon Falls Asleep On The Floor After Completing Seven Operatios-TeluguStop.com

అలాంటి వైద్య వృత్తి లో చాలా డెడికేషన్ తో వ్యవహరించే వైద్యులు ఈ రోజుల్లో చాలా కరువే అని చెప్పాలి.అయితే చైనా లో మాత్రం ఒక డాక్టర్ తన వృత్తిని దైవంలా భావించి మరీ వైద్యాన్ని అందించారు.

నిజంగా ఆయన చేసిన విషయం వింటే మాత్రం ఈయనే అసలైన డాక్టర్ అని మీరు అనుకోక మానరు.ఇంతకీ ఆయన చేసిన వైద్యం ఏంటో తెలుసా, ఎలాంటి బ్రేక్ లేకుండా వరుసగా 10 ఆపరేషన్ లు చేయడం.

ఎవరైనా ఒక్క ఆపరేషన్ లేదంటే రెండు ఆపరేషన్ లు వరుసగా చేయగలరేమో ఇక ఆ తరువాత ఆ వైద్యుడు తన రెస్ట్ మోడ్ లోకి వెళ్లిపోతుంటారు.

కానీ చైనా కు చెందిన ఈ డాక్టర్ గారేమో ఇలా వరుసగా 10 ఆపరేషన్ లు ఎలాంటి బ్రేక్ లేకుండా చేయడం తో అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు.

సౌత్‌ చైనాలోని లంగాంగ్‌ సెంట్రల్‌ హాస్పిటల్‌ (ఆర్థోపెడిక్‌)లో డాక్టర్‌ డైయూ అతని బృందం గత సోమవారం 13 గంటలపాటు పనిచేసి 10 ఆపరేషన్లు చేసింది.డాక్టర్‌ డైయూ విరామమే లేకుండా పనిచేశాడు.

ఉదయం 8 గంటలకు ఆపరేషన్‌ థియేటర్‌లోకి అడుగుపెట్టిన అతను సాయంత్రం అయిందింటి వరకు 7 ఆపరేషన్లు చేశాడు.ఇక 8వ సర్జరీ సమయంలో పేషంట్‌కు అనస్థీషియా ఇవ్వడంలో కాస్త ఆలస్యమైంది.

Telugu Hours, China, Dai Yu, Surgeon Hailed-

దాంతో డైయూకి ఓ 10 నిముషాలు సమయం దొరకడంతో థియేటర్‌లోని ఫ్లోర్‌పై ఓ మూల కూర్చోని ఓ చిన్న స్లీప్ వేసుకున్నాడు.ఆ టైంలో సిబ్బందిలో ఒకరు అతను కునుకుతీస్తున్న ఫొటో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు.దీంతో ఈ డాక్టర్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube