శ్రీవల్లి పాటకు సురేష్ రైనా స్టెప్పులు.. పుష్ప మ్యానియా ఆగడం లేదుగా..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పుష్ప. ఈ సినిమాలో గ్లామర్ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది.

 Suresh Raina Shakes Leg For Pushpa Srivalli Song Viral On Social Media Details,s-TeluguStop.com

ఈ సినిమా డిసెంబర్ 17న క్రిస్మస్ కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యి అన్ని చోట్ల పాజిటివ్ టాక్ తెచ్చుకుని భారీ వసూళ్లను సాధించింది.

ఇక ఈ మధ్యనే ఓటిటి లో కూడా విడుదల అయ్యి అక్కడ కూడా సూపర్ హిట్ అనిపించుకుంది.

ఈ సినిమా విడుదల అయ్యి నెల రోజులు గడుస్తున్న పుష్ప మానియా ఇంకా తగ్గడం లేదు.ముఖ్యంగా ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన అంశం మ్యూజిక్.దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంది.

ఇక ఈ సినిమాలోని శ్రీవల్లి పాట క్రేజ్ రోజురోజుకూ పెరిగి పోతుంది.

గత రెండు రోజుల నుండి పుష్ప సినిమాలోని శ్రీవల్లి సాంగ్ కు సంబంధించిన వీడియోలు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి.ఇప్పటికే మన దేశ క్రికెటర్లు మాత్రమే కాకుండా ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ పాటకు స్టెప్పులు వేసిన విషయం తెలిసిందే.

తాజాగా టీమ్ ఇండియా మాజీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సురేష్ రైనా పుష్ప శ్రీవల్లి పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసి అలరించాడు.తాను ఇటీవలే సినిమా చూశానని అల్లు అర్జున్ అద్భుతంగా నటించాడని సురేష్ రైనా కొనియాడారు.అల్లు అర్జున్ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నా అంటూ.శ్రీవల్లి పాటకు ఏదో ఇలా డ్యాన్స్ చేశా అంటూ తెలిపాడు.

ప్రెసెంట్ సురేష్ రైనా వేసిన ఈ స్టెప్పులు నెటిజెన్స్ ను బాగా ఆకట్టుకుంది.ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.

మీరు కూడా ఈ వీడియో చూసి సురేష్ రైనా వేసిన స్టెప్పులు ఎలా ఉన్నాయో చెప్పండి.

Suresh Raina Shakes Leg For Pushpa Srivalli Song Viral On Social Media Details,suresh Raina, Pushpa, Allu Ajun, Tollywood, Srivalli Song, Viral Video ,social Media - Telugu Allu Ajun, Pushpa, Srivalli, Suresh Raina, Sureshraina, Tollywood

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube