చిరంజీవి హీరోయిన్ తో డేటింగ్ చేయాలనుకున్న ఆ క్రికెటర్  

Suresh Raina Reveals His Lifelong Crush On Sonali Bendre - Telugu Bollywood, Indian Cricket, Sonali Bendre, Suresh Raina Reveals His Lifelong Crush, Tollywood

ఇండియాలో సినిమా-క్రికెట్ ఎప్పుడు దగ్గర సంబంధం కలిగి ఉంటాయి.రెండు రంగాలలో ఉన్న వారు ఎక్కువగా రిలేషన్ షిప్ లో ఉంటారు.

Suresh Raina Reveals His Lifelong Crush On Sonali Bendre - Telugu Bollywood Indian Cricket Tollywood

సెలబ్రిటీ లైఫ్ లో ఎక్కువగా పార్టీ కల్చర్ కి దగ్గరగా ఉండే వీరు కలవడానికి పబ్ లు, నైట్ పార్టీలు, పెద్ద పెద్ద ఈవెంట్ లు వేదిక అవుతాయి.అక్కడ కలిసిన తర్వాత రిలేషన్ లోకి వెళ్ళడం తరువాత పెళ్లి చేసుకొని జంటగా మారడం చేస్తూ ఉంటారు.

ప్రస్తుతం హార్దిక్ పాండ్యా వరకు ఆ కల్చర్ కొనసాగుతుంది.ఇదిలా ఇండియన్ క్రికెటర్ సురేష్ రైనా కూడా ఒక హీరోయిన్ తో డేటింగ్ కి వెళ్లాలని అనుకున్నట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

గాయం కారణంగా గత ఏడాది నుంచి క్రికెట్ కు దూరంగా ఉంటున్న సురేష్ రైనా ఐపీఎల్ లో సత్తా చాటి తిరిగి టీం ఇండియాలో చోటు సొంతం చేసుకోవాలని భావిస్తున్నాడు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన క్రష్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

కెరియర్ ఆరంభంలో చిరంజీవితో ఇంద్ర, శంకర్ దాదా సినిమాలలో ఆడిపాడిన సోనాలీ బింద్రె అంటే చాలా ఇష్టం ఉండేదని ఆమెతో డేటింగ్ కు వెళ్లాలని కూడా చాలా అనుకున్నా అని చెప్పాడు.అయితే ఆ అవకాశం తనకి దొరకలేదని తెలిపాడు.

ఒకానొక సమయంలో ఆమె నుండి ఒక మంచి మెసేజ్ నాకు వచ్చింది.ఆ మెసేజ్ నాకు చాలా ఆనందాన్ని కలిగించిందని సురేష్ రైనా పేర్కొన్నాడు.

అయితే ఆమె రెండేళ్ళ క్రితం క్యాన్సర్ బారిన పడిన చికిత్స తీసుకొని ప్రాణాల నుంచి బయటపడిన సంగతి తెలిసిందే.ఈ నేపధ్యంలో సురేష్ రైనా చేసిన ఈ కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి.

తాజా వార్తలు