సురేశ్​ రైనా ఖాతాలో అరుదైన రికార్డు..!

చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాడు సురేశ్‌ రైనా అరుదైన ఘనతను సాధించాడు. ఐపీఎల్‌లో 200 మ్యాచ్‌ ఆడుతున్న రెండో క్రికెటర్‌గా రికార్డు పుస్తకాల్లోకెక్కాడు.

 Suresh Raina Ipl Csk New Record Ipl Dhoni Team-TeluguStop.com

ఈ ఫీట్‌ను సాధించిన తొలి సీఎస్‌కే క్రికెటర్‌ ఎంఎస్‌ ధోని, ఆ తర్వాత స్థానంలో రైనా నిలిచాడు.ముంబై ఇండియన్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌ ద్వారా రైనా ఈ ఫీట్‌ను సాధించాడు.

ఓవరాల్‌గా ఐపీఎల్‌లో 200వ మ్యాచ్‌లు ఆడిన నాల్గో ప్లేయర్‌గా రైనా గుర్తింపు పొందాడు.అంతకుముందు రోహిత్‌ శర్మ, దినేశ్‌ కార్తీక్‌లు కూడా 200 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్లు.

 Suresh Raina Ipl Csk New Record Ipl Dhoni Team-సురేశ్​ రైనా ఖాతాలో అరుదైన రికార్డు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాగా, విరాట్‌ కోహ్లి 200వ ఐపీఎల్‌ మ్యాచ్‌కు అడుగుదూరంలో ఉన్నాడు.సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో వచ్చే వారం జరుగనున్న మ్యాచ్‌లో కోహ్లి ఈ మైలురాయిని చేరుకోనున్నాడు.

ప్రస్తుతం కోహ్లి 199 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడాడు.

ఈ ఐపీఎల్‌లో రైనా ఇప్పటికే ఒక ఘనతను నమోదు చేశాడు.

ఇటీవలే ఐపీఎల్‌లో సురేష్ రైనా ఓ ఘనతను నమోదు చేసిన విషయం తెలిసిందే.ఐపీఎల్‌లో 200 సిక్సర్లు బాదిన 7వ క్రికెటర్‌గా నిలిచాడు.

మార్చి 19న ముంబైలోని వాంఖడే స్టేడియంలో బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో రైనా రెండు సిక్స్‌లు కొట్టడం ద్వారా 200 సిక్సర్ల మార్కును చేరాడు.వాషింగ్టన్‌ సుందర్‌ బౌలింగ్‌లో రైనా ఆ రెండు సిక్స్‌లను కొట్టాడు.

టోర్నీలో అత్యధిక సిక్సులు బాదిన రికార్డు విండీస్ హిట్టర్, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్‌పై ఉంది.గేల్‌ 356 సిక్సర్లతో టాప్‌లో ఉన్నాడు.

#Suresh Raina #Sports Updates #New Record #Dhoni Team #Ipl 2021

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు