సొంత ఓటీటీ కాదట, కాని..!

ప్రముఖ నిర్మాత సురేష్‌ బాబు ఓటీటీని ప్రారంభించబోతున్నట్లుగా గత కొన్నాళ్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.ఇప్పటికే టాలీవుడ్‌ నిర్మాత అల్లు అరవింద్‌ ఆహా అంటూ ప్రారంభించాడు.

 Ott, Suresh Babu, Suresh Productions,ott Platforms,amzon, Netflix-TeluguStop.com

కనుక ఆయనకు పోటీగా సురేష్‌ ప్రొడక్షన్స్‌ వారి ఓటీటీ ఉంటుందని, ఇది ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకులకు మంచి కంటెంట్‌ను అందిస్తుందనే నమ్మకంను చాలా మంది వ్యక్తం చేశారు.సురేష్‌బాబు అధికారిక ప్రకటన కోసం అంతా ఎదురు చూస్తున్న సమయంలో ఆశ్చర్యకరంగా ఆ వార్తలు నిజం కాదంటూ ప్రకటన వచ్చింది.

సురేష్‌ ప్రొడక్షన్స్‌కు చెందిన పీఆర్‌ టీం తాజాగా ఆ వార్తలను కొట్టి పారేసింది.ప్రస్తుతం సురేష్‌ ప్రొడక్షన్‌ నుండి ఎలాంటి ఓటీటీ రావడం లేదు.అసలు అలాంటి ఆలోచన ప్రస్తుతానికి సురేష్‌ బాబుకు లేదంటూ వారు పేర్కొన్నారు.గతంలో సురేష్‌ బాబు థియేటర్ల భవితవ్యంపై అనుమానాలను వ్యక్తం చేస్తూ వ్యాఖ్యలు చేశాడు.

కనుక సురేష్‌ బాబు ఖచ్చితంగా ఓటీటీ ప్రారంభిస్తాడని అంతా అనుకున్నారు.కాని అది నిజం కాదని పీఆర్‌ టీం ప్రకటించింది.

Telugu Amzon, Netflix, Ott Platms, Suresh Babu, Suresh-

ఓటీటీ అయితే ప్రారంభించరు కాని ఓటీటీ కోసం వెబ్‌ సిరీస్‌లను నిర్మించేందుకు రెడీ అవుతున్నారట.ఈ విషయంలో ఇప్పటికే పలువురు యంగ్‌ డైరెక్టర్స్‌తో సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంప్రదింపులు జరిపారంటూ వార్తలు వస్తున్నాయి.వెబ్‌ సిరీస్‌ల్లో కొత్తదనంతో పాటు రిచ్‌ నెస్‌ను తీసుకు వస్తే ఖచ్చితంగా ఓటీటీపై సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంచలనం సృష్టించే అవకాశం ఉంది.అమెజాన్‌ నెట్‌ప్లిక్స్‌ వంటి ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లతో వ్యాపారం నిర్వహిస్తూ మేకింగ్‌లో దూసుకు పోయినట్లయితే తప్పకుండా లాభాలు వస్తాయని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube