కరోనా కోసం కోటి విరాళం ఇచ్చిన సురేష్ ప్రొడక్షన్స్  

Suresh Productions Donate 1 Cr For Corona Virus - Telugu Corona Virus, Donations, Suresh Productoions, Telugu States

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుండటంతో బాధితుల సంఖ్య కూడా వేగంగా పెరుగుతోంది.ఇప్పటికే చాలామంది ఈ వైరస్ బారిన పడిన వారిని ప్రభుత్వం ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స అందిస్తుండగా మిగతా వారు దాని బారిన పడకుండా ఇళ్లల్లోనే ఉండాలని లాక్‌డౌన్ ప్రకటించింది.

 Suresh Productions Donate 1 Cr For Corona Virus

అయితే సినిమా ఇండస్ట్రీకి చెందిన పేద కళాకారులు ఎలాంటి పనులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఇప్పటికే టాలీవుడ్‌కు చెందని పలువుర ప్రముఖులు ముందుకు వచ్చి విరాళాలు ప్రకటించారు.

కాగా తాజాగా టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ అయిన సురేష్ ప్రొడక్షన్స్ పేద కళాకారులు, కరోనా వైరస్‌ను అరికట్టేందుకు ఆరోగ్య శాఖకు కలిపి రూ.కోటి విరాళంగా అందించారు.కరోనా మహమ్మారిని అందరం కలిసి తరమికొట్టాలని సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ పిలుపునిచ్చింది.

కరోనా కోసం కోటి విరాళం ఇచ్చిన సురేష్ ప్రొడక్షన్స్-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇక టాలీవుడ్‌కు చెందిన అందరూ ముందుకు వచ్చి తమవంతు సాయం చేయాలని వారు కోరారు.

అటు సినిమాల పరంగా సురేష్ ప్రొడక్షన్స్ ప్రస్తుతం విక్టరీ వెంకటేష్‌ హీరోగా నటిస్తున్న నారప్ప చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.

ఈ సినిమాను వీలైనంత త్వరగా రిలీజ్ చేసేందుకు వారు ప్లాన్ చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Suresh Productions Donate 1 Cr For Corona Virus Related Telugu News,Photos/Pics,Images..