నారప్ప కోసం ఇద్దరు.. ప్లాన్ వర్కువుట్ అవుతుందా?  

Suresh Babu To Put Two Directors For Naarappa-naarappa,srikanth Addala,suresh Babu,venkatesh

తమిళంలో సూపర్ హిట్ అయిన ‘అసురన్’ చిత్రాన్ని తెలుగులో విక్టరీ వెంకటేష్ నారప్ప అనే టైటిల్‌తో తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఇటీవల రిలీజ్ చేయగా అది బాగా వైరల్ అయ్యింది.

Suresh Babu To Put Two Directors For Naarappa-Naarappa Srikanth Addala Suresh Venkatesh

వెంకటేష్ అగ్రెసివ్ లుక్ సినిమాపై అమాంతం అంచనాలు పెంచేసింది.అయితే ఈ సినిమాను బ్రహ్మోత్సవం లాంటి డిజాస్టర్ సినిమా.

సారీ సీరియల్ లాంటి సినిమాను అందించిన శ్రీకాంత్ అడ్డాలతో చేయబోతుండటంతో ఈ సినిమాపై పలు వర్గాల్లో అనుమానం రెకెత్తుతోంది.

అయితే ఈ సినిమా విషయంలో నిర్మాత సురేష్ బాబు తనదైన స్ట్రాటజీతో వెళుతున్నాడు.

ఇటీవల వెంకీ మామ సినిమాతో సక్సెస్‌ను అందుకున్న బాబీని నారప్ప సినిమాకు మరో దర్శకుడిగా పెట్టనున్నాడట సురేష్ బాబు.యాక్షన్ సీక్వెన్స్‌లకు సంబంధించిన డైరెక్షన్ బాధ్యతలను బాబీకి ఇవ్వనున్నాడట నిర్మాత.

కథా పరంగా డైరెక్షన్‌ బాధ్యతలు శ్రీకాంత్ అడ్డాలకు ఇచ్చాడు సురేష్ బాబు.ఈ సినిమాతో వెంకటేష్ ఎలాంటి హిట్ కొడతాడా అని అందరూ వెయిట్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమాలో వెంకీ సరసన బ్లాక్ బ్యూటీ ప్రియమణి హీరోయిన్‌గా నటిస్తోంది.విలేజ్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాకు ఇద్దరు దర్శకుల పనితనం ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలియాలి.

ఏదేమైనా ఈ సినిమా ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

తాజా వార్తలు

Suresh Babu To Put Two Directors For Naarappa-naarappa,srikanth Addala,suresh Babu,venkatesh Related....