ఇన్ని రోజులుగా వస్తున్న వార్తలు నిజం కాదని తేలిపోయింది  

Suresh Babu Son Abhiram Not Act In Asuran Movie-venky Mamma Producer Suresh Babu,venky Mamma Promotions

ప్రముఖ నిర్మాత సురేష్‌ బాబు చిన్న కొడుకు అభిరామ్‌ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా వార్తలు వస్తున్న విషయం తెల్సిందే.హీరోగా రాబోతున్నాడని అన్నారు.మళ్లీ గత రెండు వారాలుగా అభిరామ్‌ ‘అసురన్‌’ రీమేక్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా ప్రచారం జరిగింది.అసురన్‌ రీమేక్‌లో అభిరామ్‌ కీలక పాత్రలో కనిపిస్తాడని, మొదట నటనకు ఆస్కారం ఉన్న పాత్ర చేసి నటుడిగా నిరూపించుకుని ఆ తర్వాత రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నట్లుగా ప్రచారం జరిగింది.

Suresh Babu Son Abhiram Not Act In Asuran Movie-venky Mamma Producer Suresh Babu,venky Mamma Promotions Telugu Tollywood Movie Cinema Film Latest News-Suresh Babu Son Abhiram Not Act In Asuran Movie-Venky Mamma Producer Venky Promotions

నేడు సురేష్‌బాబు ‘వెంకీమామ’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా మాట్లాడుతూ ఆ వార్తలపై ఒక క్లారిటీ ఇచ్చాడు.అసురన్‌లో అభిరామ్‌ నూటికి నూరు పాళ్లు నిజం కాదని తేల్చి పారేశాడు.

అసలు అసురన్‌లో ఎలాంటి పాత్రకు కూడా అభిరామ్‌ను పరిశీలించడం లేదు అంటూ ఈ సందర్బంగా సురేష్‌బాబు చెప్పుకొచ్చాడు.అభిరామ్‌ హీరోగా ఎంట్రీ ఇవ్వడం కన్ఫర్మ్‌.

అయితే సోలో హీరోగానే అభిరామ్‌ హీరోగా పరిచయం అవుతాడంటూ ఈ సందర్బంగా సురేష్‌బాబు క్లారిటీ ఇచ్చాడు.

తాజా వార్తలు