మరో కొరియన్ మూవీ రీమేక్ పై కన్నేసిన సురేష్ బాబు  

Suresh Babu Plan To Remake Korean Movie - Telugu Remake Korean Movie, South Cinema, Suresh Babu, Tollywood

సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో ఈ మధ్యకాలంలో వరుస సినిమాలు తెరకేక్కిస్తూ హిట్స్ కొడుతున్నారు.మరో వైపు చిన్న సినిమాలని కూడా తన బ్యానర్ మీద రిలీజ్ చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు.

Suresh Babu Plan To Remake Korean Movie

ఇక ఈ బ్యానర్ లో భారీ బడ్జెట్ చిత్రం హిరణ్యకశిప రానా టైటిల్ రోల్ లో తెరకెక్కుతుంది.ఇదిలా ఉంటే ఆ మధ్య కొరియన్ నుంచి ఓ బేబీ సినిమాని సమంత లీడ్ రోల్ లో తెరకెక్కించి సూపర్ హిట్ కొట్టారు.

సమంత లేడీ ఒరియాంటెడ్ గా తెరకెక్కిన ఆ సినిమా ఆమెకి కెరియర్ లో బెస్ట్ హిట్ ఇచ్చింది.ప్రస్తుతం హీరోయిన్ గా చేస్తూనే సమంత మళ్ళీ అదిరిపోయే కథ కోసం చూస్తుంది.

ఇదిలా ఉంటే సురేష్ బాబు మళ్ళీ ఓ కొరియన్ మూవీని రీమేక్ చేయడానికి సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది.

పోలీసుల ట్రైనింగ్‌లో ఉన్న ఇద్దరు యువకుల కథతో తెరకెక్కిన మిడ్‌ నైట్‌ రన్నర్స్‌ సినిమాను తెలుగులో రీమేక్‌ కి ప్లాన్ చేస్తున్నారు.

పోలీష్ అకాడమీలో ట్రైనింగ్‌లో ఉన్న ఇద్దరు యువకులు అత్యుత్సాహంతో ఓ కిడ్నాప్ కేసును పరిష్కరించేందుకు ప్రయత్నించి చిక్కుల్లో పడటం ఈ సినిమా కథ.అయితే ఒరిజినల్‌ వెర్షన్ లో ఇద్దరు కుర్రాళ్ళని ఇద్దరు అమ్మాయిలుగా మార్చి స్క్రిప్ట్ సిద్ధం చేయిస్తునట్లు తెలుస్తుంది.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు కూడా ప్రారంభమైనట్లు సమాచారం.ప్రధాన పాత్రలకు రెజీనా, నివేదా థామస్‌ల పేర్లను పరిశీలిస్తున్నట్లు ఫిలిం నగర్ లో వినిపిస్తుంది.

ఈ సినిమాకు సుధీర్‌ వర్మని దర్శకుడిగా ఫైనల్ చేసినట్లు సమాచారం.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Suresh Babu Plan To Remake Korean Movie Related Telugu News,Photos/Pics,Images..

footer-test