నిశ్చితార్థమా.. నవ్వేసిన సురేష్ బాబు!  

Suresh Babu Rana Daggubati Miheeka Bajaj - Telugu Miheeka Bajaj, Rana Daggubati, Rana Engagement, Suresh Babu

టాలీవుడ్ హంక్ రానా దగ్గుబాటి ఇటీవల సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాడు.తను కొంతకాలంగా ప్రేమిస్తున్న అమ్మాయి ఓకే చెప్పిందనే పోస్ట్ పెట్టి టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయాడు.

 Suresh Babu Rana Daggubati Miheeka Bajaj

హీరోగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన రానా, బాహుబలి చిత్రంలో చేసిన విలన్ పాత్రతో అదిరిపోయే క్రేజ్‌ను దక్కించుకున్నాడు.ఇక అక్కడి నుండి వెనక్కి తిరిగి చూసుకోకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ హీరో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అనే ట్యాగ్‌లైన్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు.

అయితే మిహికా బజాజ్ అనే అమ్మాయిని తాను ప్రేమిస్తున్నానని, ఆమె తన ప్రేమకు ఎట్టకేలకు ఓకే చెప్పిందని ఓ ఫోటోతో అందరికీ ట్విస్ట్ ఇచ్చాడు రానా.కాగా రెండు కుటుంబాల సభ్యులు రానా-మిహికాల పెళ్లికి అంగీకరించారని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపించాయి.

నిశ్చితార్థమా.. నవ్వేసిన సురేష్ బాబు-Gossips-Telugu Tollywood Photo Image

అంతేగాక ఏకంగా నిన్న(మే 20న) రామానాయుడు స్టూడియోస్‌లో రానా నిశ్చితార్థం కూడా చాలా సాదాసీదాగా జరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి.అయితే ఈ వార్తలపై రానా తండ్రి ప్రముఖ నిర్మాత సురేష్ బాబు స్పందించారు.

రెండు కుటుంబాల సభ్యులు కలిసిన విషయం నిజమేనని, కానీ ఎలాంటి నిశ్చితార్థ వేడుక జరగలేదని ఆయన తెలిపారు.రానా-మిహికాల నిశ్చితార్థం, వివాహానికి సంబంధించిన విషయాలపై చర్చించేందుకు తాము మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలిపారు.

ఈ ఏడాదిలోనే రానా పెళ్లి జరపనున్నట్లు సురేష్ బాబు అన్నారు.కాగా ఈ వేడుకలకు సంబంధించిన తాము ఖచ్చితంగా వివరాలు తెలుపుతామని, అంతవరకు అభిమానులు వేచిచూడాల్సిందిగా ఆయన కోరారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Suresh Babu Clarifies On Rana Engagement News Related Telugu News,Photos/Pics,Images..