రామానాయుడు స్టూడియో విషయంలో ఆసక్తికర విషయం చెప్పిన సురేష్‌బాబు

హైదరాబాద్‌లో రామానాయుడు స్టూడియోను తొలగిస్తున్నట్లుగా గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది.నానక్‌రామ్‌గూడ రామానాయుడు స్టూడియో మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగానే తొలగించబోతున్నట్లుగా సురేష్‌బాబు ప్రకటించాడు.

 Ramanaidu Studio, Suresh Babu, Rama Naidu Studio With New Technologies, Web Seri-TeluguStop.com

అక్కడ కమర్షియల్‌ కాంప్లెక్స్‌లు ఏర్పాటు చేసే విషయమై చర్చిస్తున్నట్లుగా ప్రకటించాడు.అయితే ఇదే సమయంలో హైదరాబాద్‌లో అంతకు మించిన రామానాయుడు స్టూడియోను కూడా ఏర్పాటు చేసే విషయంలో చర్చలు జరుగుతున్నట్లుగా సురేష్‌బాబు పేర్కొన్నాడు.

రామానాయుడు స్టూడియోను తొలగించినంత మాత్రాన తాము స్టూడియోలకు దూరం అవుతున్నట్లుగా కాదు, అంతకు మించిన స్టూడియోను అత్యాధునిక టెక్నాలజీతో ఏర్పాటు చేసే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా పేర్కొన్నాడు.ప్రస్తుతం స్టూడియో ఉన్న ప్రాంతం కమర్షియల్‌గా బాగా అభివృద్ది చెందింది కనుక కమర్షియల్‌ కాంప్లెక్స్‌కు బాగా ఉంటుంది.

అందుకే ఆ విధంగా దాన్ని ఉపయోగించబోతున్నాం.సిటీకి మరోసారి దూరంగా స్టూడియోను నిర్మిస్తామంటూ సురేష్‌బాబు అన్నాడు.

Telugu Rama Studio, Small, Suresh Babu, Web-

నానక్‌రామ్‌గూడ స్టూడియోకు దాదాపు రెట్టింపు స్టూడియోను నిర్మిస్తామని అది ఎప్పుడు ఎక్కడ అనే విషయంలో త్వరలోనే క్లారిటీ ఇస్తామంటూ ఈ సందర్బంగా సురేష్‌బాబు ప్రకటించాడు.సినిమాల నిర్మాణం తగ్గించారనే విషయంపై స్పందిస్తూ పెద్ద సినిమాల నిర్మాణం తగ్గించినా చిన్న సినిమాల విషయంలో మేము చాలా స్పీడ్‌గా ఉన్నామన్నాడు.వెబ్‌ సిరీస్‌ల నిర్మాణం కూడా త్వరలో మొదలు పెట్టబోతున్నట్లుగా సురేష్‌బాబు ప్రకటించాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube