హీరో, హీరోయిన్స్ రెమ్యునరేషన్ తగ్గించుకోవాలంటా

కరోనా ప్రభావం సినీ రంగంపై తీవ్రస్థాయిలో పడింది.రిలీజ్ కి రెడీ అయిన సినిమాలు ఆగిపోయాయి.

 Suresh Babu Open Up After Lock Down Situation, Tollywood, Telugu Cinema-TeluguStop.com

షూటింగ్ లు కూడా వాయిదా పడిపోయాయి.ఇక థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయి.

షూటింగ్ లకి పర్మిషన్ ఎప్పుడు ఇస్తారు అనేది అర్ధం కాని విషయంగా ఉంది.ఒక వేళ షూటింగ్ లు మళ్ళీ మొదలైన లాక్ డౌన్ కారణంగా పడ్డ భారాన్ని నిర్మాతలు భరించాల్సి ఉంటుంది.

అదే సమయంలో థియేటర్స్ లో ఇదివరకటిలా గుంపులుగా వెళ్లి చూడలేని పరిస్థితి.కరోనా వాక్సిన్ వచ్చేంత వరకు భౌతిక దూరం కచ్చితంగా పాటించి తీరాల్సిందే.

ఎవరిలో వైరస్ ఉంటుంది అనే విషయం తెలియని విషయం కాబట్టి కచ్చితంగా గతంలో మాదిరి జనసందోహం కనిపించదు.ఈ నేపధ్యంలో తాజాగా సురేష్ బాబు లాక్ డౌన్ తర్వాత ఇండస్ట్రీ పరిస్థితి గురించి మీడియాతో మాట్లాడారు.

లాక్ డౌన్ మరికొంత కాలం పాటు ఉంటుందని నిర్మాత సురేశ్ బాబు అన్నారు.ఈ మహమ్మారి వ్యాప్తి ఎలా ఉండబోతుందో చెప్పలేమని తెలిపారు.పరిశ్రమ నష్టాల్లో ఉన్న ఈ సమయంలో హీరో, హీరోయిన్లు, దర్శకులతో పాటు అందరూ పారితోషికాలు తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.విడతలవారీగా లాక్ డౌన్ ఎత్తేసినంత మాత్రాన థియేటర్లు తెరుచుకోవని చెప్పారు.

చిన్న సినిమా షూటింగులు జరగొచ్చని, ఎక్కువ మంది ఆర్టిసులు అవసరమయ్యే సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలు మాత్రం ఇబ్బంది పడొచ్చని అన్నారు.ప్రస్తుతం కొన్ని డబ్బింగ్ సినిమాలు ఉన్నాయని… ముందు వాటిని పూర్తి చేసుకుంటే కొంత డబ్బు సంపాదించుకోవచ్చని చెప్పారు.

కరోనాకు వ్యాక్సిన్ వచ్చేంత వరకు ఇబ్బందులు తప్పవని సురేశ్ బాబు తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube