దృశ్యం 2 ఒటీటీ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన సురేష్ బాబు

మోహన్ లాల్, మీనా జోడీగా జీతూజోసెఫ్ దర్శకత్వంలో మలయాళీ సూపర్ హిట్ మూవీ దృశ్యం సీక్వెల్ గా దృశ్యం2 తెరకెక్కిన సంగతి తెలిసిందే.మొదటి సినిమా కంటే మరింత పెర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే తో సీక్వెల్ ని దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించి సూపర్ సక్సెస్ అందుకున్నాడు.

 Suresh Babu Gives Clarity On Drishyam 2 Release In Ott, Venkatesh, Meena, Tollyw-TeluguStop.com

ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయ్యి మంచి టాక్ సొంతం చేసుకుంది.ఈ నేపధ్యంలో విక్టరీ వెంకటేష్ కూడా దృశ్యం సినిమా చేసి ఉండటంతో సీక్వెల్ ని సెట్స్ పైకి తీసుకొని వెళ్ళడానికి రెడీ అయిపోయాడు.

సురేష్ ప్రొడక్షన్ లో జీతూ జోసెఫ్ దర్శకత్వంలోనే దృశ్యం2 తెలుగు రీమేక్ ని స్టార్ట్ చేసి కేవలం రెండు నెలల్లో షూటింగ్ మొత్తం పూర్తి చేసేశారు.పకడ్బందీ స్క్రిప్ట్ ఉండటంతో నేటివిటీ మాత్రం మార్చుకొని స్క్రిప్ట్ లో పెద్దగా మార్పులు చేయకుండా జీతూ జోసెఫ్ సెట్స్ పైకి వెళ్ళిపోయి సినిమాని కంప్లీట్ చేసేశాడు.

ఇదిలా ఉంటే ఇప్పుడు తెలుగు దృశ్యం2 రీమేక్ ని కూడా ఒటీటీలో రిలీజ్ చేయడానికి ప్లాన్ జరుగుతుందనే టాక్ వినిపిస్తుంది.ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వేవ్ ఉండటంతో పాటు థియేటర్స్ లో క్లోజ్ చేసేయడం, ఏపీలో కూడా థియేటర్స్ టికెట్ రెట్లు ఎఫెక్ట్ తో సురేష్ బాబు తన థియేటర్స్ అన్నింటిని క్లోజ్ చేసేయడంతో ఒటీటీలో రిలీజ్ చేస్తారనే ప్రచారం జరిగింది.

అమెజాన్ ప్రైమ్ నుంచి మంచి డీల్ వచ్చిందని సురేష్ బాబు కూడా దీనికి ఒప్పుకొని డిజిటల్ రిలీజ్ కి మొగ్గు చూపించారని గుసగుసలు వినిపించాయి.అయితే తాజాగా నిర్మాత సురేష్ బాబు దీనిపై క్లారిటీ ఇచ్చారు.దృశ్యం2 ఒటీటీ రిలీజ్ పై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తేల్చేశారు.తాను క్లారిటీ ఇచ్చే వరకు వేచి చూడాలని చెప్పారు.

అయితే సురేష్ బాబు చెప్పిన మాటల్లో కూడా ఒటీటీలో రిలీజ్ చేయమనే విషయాన్ని మాత్రం ఎక్కడ చెప్పకపోవడం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube