రానా హెల్త్‌ గురించి అసలు విషయం చెప్పేసిన సురేష్‌బాబు  

Suresh Babu Give The Clarify About Rana Health-produce And Father Of Rana,rana Suffer From Health Issue,suresh Babu

గత కొన్ని రోజులుగా రానా హెల్త్‌ గురించిన వార్తలు మీడియాలో మరియు సోషల్‌ మీడియాలో ఏ స్థాయిలో వస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.రానా హెల్త్‌ విషయంపై ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు అనేస్తున్నారు, మాట్లాడేస్తున్నారు.అంతా కూడా ఇష్టానుసారంగా మాట్లాడేస్తున్నారు.అయితే రానా విషయంలో ఇప్పటి వరకు కుటుంబ సభ్యుల నుండి క్లారిటీ రాలేదు.

Suresh Babu Give The Clarify About Rana Health-produce And Father Of Rana,rana Suffer From Health Issue,suresh Babu-Suresh Babu Give The Clarify About Rana Health-Produce And Father Of Rana Suffer From Health Issue

తాజాగా రానా తండ్రి ప్రముఖ నిర్మాత సురేష్‌ బాబు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

Suresh Babu Give The Clarify About Rana Health-produce And Father Of Rana,rana Suffer From Health Issue,suresh Babu-Suresh Babu Give The Clarify About Rana Health-Produce And Father Of Rana Suffer From Health Issue

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రానా కంటి ఆపరేషన్‌ చేయించుకున్నాడంటూ మేము గతంలోనే చెప్పాను.ఇప్పుడు అదే విషయాన్ని సురేష్‌బాబు చెప్పుకొచ్చాడు.రానాకు చిన్నప్పటి నుండి ఒక కన్ను సమస్య ఉంది.ఆ కారణంగానే ఆయనుకు ఆపరేషన్‌ చేయించాము.చిన్న తనంలో ఆపరేషన్‌ మంచిది కాదంటే ఇన్నాళ్లకు చేయించాము.ఆపరేషన్‌ వల్ల టెన్షన్‌తో బీపీ డౌన్‌ అయ్యిందని, అందుకే బాగా బక్కగా అయ్యాడు అంటూ సురేష్‌బాబు చెప్పుకొచ్చాడు.

త్వరలోనే రానా మళ్లీ మునుపటి రూపంలోకి వస్తాడంటూ సురేష్‌బాబు ఆశాభావం వ్యక్తం చేశాడు.త్వరలోనే రానా హీరోగా సినిమాలు ప్రారంభం కాబోతున్నాయి.ప్రస్తుతం ఆయన చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నాయి.హిందీలో కూడా ఒక సినిమాను ఈయన చేయబోతున్నాడు.వరుసగా చిత్రాలు చేస్తున్న రానా మళ్లీ టాలీవుడ్‌ స్టార్‌ హీరోల జాబితాలో నిలుస్తాడని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు ఆయన అభిమానులు.రానా గురించి గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలకు దీంతో ఫుల్‌ స్టాప్‌ పడ్డట్లే.