సురేష్‌బాబు గారు నీతు ఇతరులకేనా? మీకు వర్తించవా?  

For the last few years, the promotions of films are tuned by Tollywood. The audio ceremony and movie success before the release of the film were held only 50 days or 100 days. But now we're doing different things. The audio ceremony, platinum disc celebration and pre-release ceremonies are awaited before release of the film. The film is about ten days of the release of the film and the celebration of the festival is in the media.

.

..

..

..

టాలీవుడ్‌లో గత కొంత కాలంగా సినిమాల ప్రమోషన్స్‌ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. అప్పట్లో సినిమా విడుదలకు ముందు ఆడియో వేడుక, సినిమా సక్సెస్‌ అయితే 50 రోజులు లేదా 100 రోజుల వేడుకలు మాత్రమే నిర్వహించేవారు. కాని ఇప్పుడు రకరకాలుగా ఈవెంట్‌లు చేస్తున్నారు. సినిమా విడుదలకు ముందు ఆడియో వేడుక, ప్లాటినం డిస్క్‌ వేడుక మరియు ప్రీ రిలీజ్‌ వేడుకలు జరుపుతున్నారు...

సురేష్‌బాబు గారు నీతు ఇతరులకేనా? మీకు వర్తించవా?-

ఇక సినిమా విడుదలైన వారం పది రోజులకే సక్సెస్‌ వేడుక, థ్యాంక్స్‌ మీట్‌లు అంటూ మీడియాలో సందడి చేస్తున్నారు.

సక్సెస్‌ వేడుక, థ్యాంక్స్‌ మీట్‌లు సినిమా సక్సెస్‌ అయితే నిర్వహిస్తే పర్వాలేదు అనిపిస్తుంది. కాని సినిమాలు ఫ్లాప్‌ అయినా కూడా సక్సెస్‌ వేడుక, సక్సెస్‌ మీట్‌లు నిర్వహించడం విమర్శలకు తావిస్తుంది. సినిమా అట్టర్‌ ఫ్లాప్‌ అయినా కూడా నిసిగ్గుగా సక్సెస్‌ వేడుకను నిర్వహిస్తున్నారు.

ఈ సక్సెస్‌ మీట్‌లపై ఆమద్య ప్రముఖ నిర్మాత సురేష్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశాడు. అప్పట్లో సురేష్‌బాబు మాట్లాడుతూ తెలుగు సినిమా పరిశ్రమలో జరుగుతున్న సక్సెస్‌ మీట్‌లు, థ్యాంక్స్‌మీట్‌లు చిరాకుగా అనిపిస్తున్నాయి. సినిమా సక్సెస్‌ కాకున్నా కూడా ఇలాంటి ప్రచారం నిర్వహించడం వల్ల, అసలైన సక్సెస్‌ మూవీ ఏదో ప్రేక్షకులు తెలుసుకోలేక పోతున్నారు అంటూ సురేష్‌బాబు విమర్శలు చేయడం జరిగింది..

అప్పుడు అలా విమర్శలు చేసిన సురేష్‌బాబు ఇప్పుడు తానే స్వయంగా ఆ తప్పును చేస్తున్నాడు. తాజాగా సురేష్‌బాబు నిర్మాణంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది’. భారీ అంచనాల నడుమ రూపొందిన ఆ చిత్రంకు తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వం వహించాడు.

అంతా కొత్త వారితో తెరకెక్కిన ఆ చిత్రం ఏమాత్రం ఆకట్టుకోలేక పోయింది. ఆశించిన స్థాయిలో లేక పోవడంతో ప్రేక్షకులు మరియు రివ్యూవర్స్‌ సినిమాకు నెగటివ్‌ ఫీడ్‌ బ్యాక్‌ ఇస్తున్నారు.

ఓవర్సీస్‌లో ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందని భావించిన చిత్ర యూనిట్‌ సభ్యులకు భారీ షాక్‌ తగిలినట్లయ్యింది.

అయినా కూడా తాజాగా ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రానికి సక్సెస్‌ మీట్‌ పేరుతో పెద్ద వేడుక చేయడం జరిగింది. చిత్ర యూనిట్‌ సభ్యులు అంతా కూడా ఆ వేడుకలో పాల్గొన్నారు. అయితే అందరికి కూడా ఆ చిత్రం ఫ్లాప్‌ అనే విషయం తెలుసు.

అయినా కూడా పబ్లిసిటీ చేయాలి కాబట్టి సక్సెస్‌ మీట్‌లో పాల్గొన్నారు. సురేష్‌బాబు అప్పట్లో సక్సెస్‌ మీట్‌లపై విమర్శలు చేయడం జరిగింది. మరి ఇప్పుడు అదే సురేష్‌బాబు తన వరకు వచ్చే వరకు ఆ విషయాన్ని మర్చి పోయాడు అంటూ సినీ విశ్లేషకులు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.

సురేష్‌బాబు గతంలో చేసిన వ్యాఖ్యలను మర్చిపోయాడా లేదంటే ఈనగరానికి ఏమైంది సినిమాను సక్సెస్‌గా ఆయన భావిస్తున్నాడా అంటూ కొందరు సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ చేస్తున్నారు. అందుకే నీతు అనేవి ఇతరులకు మాత్రమే, తమకు వర్తించవు అంటారు.