డాన్సింగ్ క్వీన్ పై క్లారిటీ ఇచ్చిన సురేష్ బాబు

సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు ఎక్కువగా నిర్మిస్తున్నారు.వాటితో వరుస సక్సెస్ లు కొడుతూ భారీగా కలెక్షన్స్ రాబడుతున్నారు.

 Suresh Babu Confirmed Dancing Queen Remake-TeluguStop.com

ఇక కొత్త నిర్మాతలు తాము తీసిన సినిమాని సురేష్ బాబుకి ఇచ్చేసి చేతులు దులుపుకుంటున్నారు.వాటికి కొంత ప్రమోషన్ అందించి సురేష్ బాబు రిలీజ్ చేసుకుంటున్నారు.

ఇలా వచ్చిన వాటిలో పెళ్లి చూపులు సినిమా నుంచి నిన్నటి పలాస వరకు చాలా వరకు హిట్స్ ఉన్నాయి.అదే సమయంలో ఇతర భాషలలో వచ్చి ఇంటరెస్టింగ్ గా అనిపించినా వాటి రీమేక్ రైట్స్ సొంతం చేసుకొని తెలుగులోకి తీసుకొస్తున్నారు.

ఇప్పటికే ఓ కొరియన్ మూవీని ఓ బేబీగా సమంతతో రీమేక్ చేసి సూపర్ హిట్ కొట్టిన సురేష్ బాబు ఇప్పుడు మరో కొరియన్ మూవీ డాన్సింగ్ క్వీన్ ని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.

డాన్సింగ్ క్వీన్ సినిమాని తెలుగులో రీమేక్ చేయబోతున్నది నిజమే అని, ఇందులో టైటిల్ రోల్ కోసం కాజల్ అగర్వాల్ ని సంప్రదించడం జరిగిందని, ఆమె కూడా ఒప్పుకుందని చెప్పారు.సినిమాకి సంబందించిన పూర్తి వివరాలు త్వరలో అఫీషియల్ గా కన్ఫర్మ్ చేస్తామని స్పష్టం చేశారు.

అయితే ఇందులో అల్లరి నరేష్ నటిస్తున్నాడా లేదా అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube