నారప్ప ఒటీటీ రిలీజ్ కి మొగ్గు చూపిస్తున్న సురేష్ బాబు

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తమిళ్ లో చేసిన అసురన్ మూవీని విక్టరీ వెంకటేష్ నారప్ప టైటిల్ తో తెరలుగులో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.

 Suresh Babu Concentrate On Narappa Movie Ott Release-TeluguStop.com

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని సురేష్ బాబు నిర్మించారు. ప్రియమణి సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

డిఫరెంట్ కథాంశంలో రివెంజ్ డ్రామాగా ఈ సినిమాని రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో శ్రీకాంత్ తెరకెక్కించారు.ఇదిలా ఉంటే ఈ సినిమాని మే15న రిలీజ్ చేయాలని ముందుగా ప్లాన్ చేసుకున్నారు.

 Suresh Babu Concentrate On Narappa Movie Ott Release-నారప్ప ఒటీటీ రిలీజ్ కి మొగ్గు చూపిస్తున్న సురేష్ బాబు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దానికి తగ్గట్లుగానే ఇప్పటికే సినిమా అవుట్ పుట్ రెడీ అయిపోయినట్లు తెలుస్తుంది.అన్ని అనుకూలంగా జరిగి ఉంటే మే మొదటి వారం నుంచి నారప్ప ప్రమోషన్ కూడా మొదలు పెట్టేసేవారు.

అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా మళ్ళీ థియేటర్స్ అన్ని కూడా మూతపడ్డాయి.

మళ్ళీ ఎప్పటికి తెరుచుకుంటాయో, తెరుచుకున్న ప్రేక్షకులు థియేటర్స్ కి వచ్చి సినిమా చూడటానికి ఆసక్తి చూపిస్తారో లేదో అనే సందేహం అందరిలో ఉంది.

ఈ నేపధ్యంలో ఇప్పటికే పలు ఒటీటీ సంస్థలు రిలీజ్ కి రెడీగా ఉన్న సినిమాలని కోనేసేందుకు మంచి ఆఫర్స్ ని నిర్మాతలకి గాలం వేస్తున్నాయి ఇక నారప్ప సినిమా కోసం కోసం అన్ని ఒటీటీ చానల్స్ నుంచి ఆఫర్స్ వచ్చినట్లు తెలుస్తుంది.దీంతో సురేష్ బాబు ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ విషయంలో పునరాలోచనలో ఉన్నారని తెలుస్తుంది.

థియేటర్స్ లో రిలీజ్ కోసం వెయిట్ చేసే కంటే ఒటీటీలో రిలీజ్ చేయడం బెటర్ అనే అభిప్రాయంతో ఉన్నారని తెలుస్తుంది.కొద్ది రోజులు ఎదురుచూసి ఒక వేళ మంచి డీల్ వస్తే ఒటీటీ రిలీజ్ నారప్పని రెడీ చేసే యోచనలో ఉన్నారని ఫిలిం నగర్ సర్కిల్ లో వినిపిస్తున్న మాట.

#Venkatesh #Priyamani #Asuran Remake #Srikanth Addala #Suresh Babu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు