థియేటర్ల ఓపెన్‌ పై సురేష్‌ బాబు సంచలన నిర్ణయం

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూ ఉన్నా కూడా లాక్‌ డౌన్‌ సడలింపులు జరుగుతున్నాయి.అన్‌ లాక్‌ అంటూ మెల్ల మెల్లగా ఆంక్షలు అన్ని కూడా తొలగించిన మోడీ ప్రభుత్వం సినిమా థియేటర్లు, మాల్స్‌ ఇంకా కొన్ని కొన్ని వాటిపై ఆంక్షలను కొనసాగిస్తుంది.

 Suresh Babu, Theaters Open, Lockdown Effect, Corona, Theaters Re Open Maintenanc-TeluguStop.com

ఆగస్టు 1 నుండి వాటిని కూడా తొలగించేందుకు సిద్దం అవుతున్నట్లుగా తెలుస్తోంది.గత అయిదు నెలలుగా పూర్తిగా మూతబడి ఉన్న థియేటర్లు మరియు మాల్స్‌ను ఓపెన్‌ చేసేందుకు అనుమతులు ఇవ్వబోతున్నారు.

థియేటర్లు ఓపెన్‌కు అనుమతులు రాబోతున్నా కూడా వాటిని ఓపెన్‌ చేసేందుకు కొందరు మాత్రం ఆసక్తి చూపడం లేదు.కొందరు థియేటర్ల యాజమాన్యం ఎప్పుడెప్పుడు అనుమతులు వస్తాయా అంటూ ఎదురు చూస్తున్నారు.

కాని సురేష్‌ బాబు వంటి సీనియర్‌ నిర్మాతలు మాత్రం ఇప్పట్లో థియేటర్లు ప్రారంభంకు అనుమతులు ఇచ్చినా ఓపెన్‌ చేయకుండా ఉంటేనే మంచిది అంటున్నారు.థియేటర్లు ఓపెన్‌ చేస్తే మెయింటెన్స్‌ భారీగా ఉంటుంది.

కాని థియేటర్లుకు జనాలు క్యూ కడతారని మాత్రం తాను అనుకోవడం లేదు అంటున్నారు.

Telugu Corona, Lockdown Effect, Suresh Babu, Theaters-

ప్రస్తుత పరిస్థితుల్లో జనాలకు బాగానే అవగాహణ వచ్చింది.కరోనాతో ముందు జాగ్రత్తగా ఉండాలని ప్రతి ఒక్కరు స్వచ్చందంగా లాక్‌డౌన్‌ పాటిస్తున్నారు.ఇలాంటి సమయంలో సినిమాలకు జనాలు వస్తారంటే అది అత్యాస అవుతుందని సురేష్‌ బాబు అంటున్నారు.

వ్యాక్సిన్‌ వచ్చే వరకు థియేటర్లు ఓపెన్‌ చేయకుంటేనే అందరికి మంచిది అంటూ సురేష్‌బాబు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు.తన ఆధీనంలో ఉన్న థియేటర్లను సురేష్‌ బాబు ఆగస్టు 1 తర్వాత ప్రారంభించేది లేదని తన సంచలన నిర్ణయాన్ని ప్రకటించాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube